భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ నేతల్లో మోదీ సత్తా చాటారు.”గ్లోబల్ లీటర్ అప్రూవల్ రేటింగ్” జాబితాలో 70 శాతంతో మోదీ తొలిస్థానంలో నిలిచారు. అమెరికా పరిశోధనా సంస్థ ” మార్నింగ్ కన్సల్ట్” విడుదల చేసిన జాబితాల్లో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ వంటి నేతలు ఉన్నారు.
70 శాతం రేటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఆమోదించిన నేతగా మోదీ ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ” మోదీ జీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఈ గౌరవం తెలియజేస్తోందని, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోదీ అగ్రస్థానంలో ఉండటం దేశానికే గర్వకారణం” అన్నారు.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी का पुनः विश्व का सबसे लोकप्रिय नेता बनना पूरे देश के लिए सम्मान की बात है। यह श्री मोदी जी के दूरदर्शी नेतृत्व पर जनता के विश्वास को दर्शाता है। pic.twitter.com/wItWtFJlER
— Nitin Gadkari (@nitin_gadkari) November 7, 2021