ఒడిశా పెను విషాదాన్ని ఒక అధికారి ముందే గుర్తించినట్లున్నారు. ఈ విషయంపై రైల్వే బోర్డును చాన్నాళ్ల కిందే ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించి తాజాగా ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. సంచలనంగా మారిన ఈ లెటర్లో ఏముందంటే..!
ఒడిశాలో జరిగిన పెను విషాదంలో ఇప్పటిదాకా మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్ రైల్వేస్ హిస్టరీలోనే అత్యంత భారీ ప్రమాదాల్లో ఒకటిగా దీన్ని విశ్లేషకులు చెబుతున్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద వార్త మొత్తం దేశవాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో గాయపడిన వారి సంఖ్య 11 వందలకు పైనే ఉంది. క్షతగాత్రుల్లో చాలా మంది డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన కారణంగా ఇంటల్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడమేనని తెలుస్తోంది. ట్రైన్ సేఫ్టీలో ప్రధానంగా భావించే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో ఎవరో కావాలనే మార్పులు చేసి ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారులు విచారణ పూర్తి చేశారు.
ఈ విషాదంలో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? ఇంటల్లాకింగ్ సిస్టమ్‌లో కావాలనే ఎవరైనా మార్పులు చేశారా అనే దానిపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాకే నిజానిజాలు ఏంటో బయటపడతాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఒక అధికారి రాసిన లెటర్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో రాబోయే ప్రమాదాన్ని మూడు నెలల ముందుగానే ఊహించి, రైల్వే ఉన్నతాధికారులకు ఆ ఆఫీసర్ తెలియజేశారు. సిగ్నల్ వ్యవస్థలోని లోపం కారణంగా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని ఆయన అందులో రాసుకొచ్చారు. హరిశంకర్ వర్మ అనే ఆ అధికారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు పశ్చిమ మధ్య రైల్వేలో ఆయన పనిచేశారు. ఆ టైమ్‌లో ఆయన ప్రిన్సిపల్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. సరిగ్గా ఆయన ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న టైమ్‌లో దక్షిణ పశ్చిమ రైలులో ఒక ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఒక రైలు మరో లైనులోకి వెళ్లింది.
ఈ ఘటనలో ఇంటర్‌లాకింగ్ కోసం రూపొందించిన వ్యవస్థను బైపాస్‌గా మార్చినప్పుడు లొకేషన్ బాక్సులో తలెత్తిన సమస్య గురించి హరిశంకర్ వర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని కొన్నాళ్ల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన రైల్వే బోర్డుకు తెలియజేశారు. ఈ విషయాన్ని బోర్డు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన కోరారు. ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో తీవ్ర లోపాలు ఉన్నాయని.. రైలు బయలుదేరిన తర్వాత డిస్పాచ్ రూట్ మారిపోతోందని హరిశంకర్ పేర్కొన్నారు. రైల్వే సిగ్నల్‌కు సంబంధించిన కీలకమైన పనులను కిందిస్థాయి ఉద్యోగులు చూసుకుంటారు, కాబట్టి అనుకోని పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని ఆయన ముందే రైల్వే బోర్డును హెచ్చరించారు. కానీ దీన్ని బోర్డు పట్టించుకున్నట్లు లేదు. దీనికి తాజా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదమే పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. మరి.. రైల్వే బోర్డుకు అధికారి రాసిన ఈ ముందస్తు లేఖ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.