మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎంతో ఆనందంగా మన కళ్లముందు తిరిగిన వారు ఉన్నట్టుండి మృత్యువడిలోకి చేరుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల విహారయాత్రల్లో విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇటీవల విహారయాత్రలో పలు విషాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు మనతో ఆనందంగా గడిపిన వాళ్లు మన కళ్లముందే మృత్యువడిలోకి చేరిపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ లో పనిచేసే ఓ ఎస్పీజీ కమాండర్ ప్రమాదవశాత్తు కన్నుమూశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర నాశిక్ జిల్లాకు చెందిన గణేష్ గీతే వయసు 36 సంతవ్సరాలు.. 2011 లో సీఐఎస్ఎఫ్ లో చేరారు. తర్వాత ఎస్పీజీ విభాగానికి ఎంపికైన గణేష్ ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కాన్వాయ్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఫిబ్రవరి 24 నుంచి సెలవులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే గురువారం గణేష్ తన భార్యా, కుమార్తె, 18 నెలల బాబు తో కలిసి షిరిడీ బాబాను సందర్శించుకోవడానికి బైక్ పై వెళ్లారు. సాయినాథుని దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఇంటికి కొద్ది దూరంలో ఉన్న మలుపు వద్ద బైక్ అదుపు తప్పి ఫ్యామిలీ మొత్తం బైక్ తో సహ గోదావరి నదిపై నిర్మించిన ఓ డ్యాక్ కాలువలో పడిపోయారు.
బైక్ కాలువలో పడటం గమనించిన స్థానికుడు వెంటనే కాలువలోకి దూకి.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న గణేష్ భార్య, కుమారుడిని రక్షించారు. కాలువ మద్యలోకి వెళ్లిపోయిన అతని కుమార్తెను రక్షించారు. అప్పటికే కాలువలో ప్రవాహం ఉధృతి ఎక్కువ కావడంతో గణేష్ ఆ ప్రవాహానికి కొట్టుకొనిపోయాడు. ఎంత వెతికినా జాడ తెలియరాలేదు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 20 గంటల తర్వాత శుక్రవారం గణేష్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ వార్త తెలియగానే గ్రామంలో విషాదం నెలకొంది. ఇటీవల గణేష్ ఎస్పీజీ విభాగంలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.