మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు, మంచి పనులకు ముగ్దురాలై ప్రశంసలు కురిపించింది. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు కొడుకు లాంటివాడని.. తన పేరున ఉన్న 25 ఎకరాల భూమిని ప్రధాని మోదీకి రాసిస్తా..అని సంచలన ప్రకటన చేసింది.
మేళ తాళాలు, సన్నాయి హోరు, పచ్చని పందిళ్లు, సరదాలు, సరాగాలు, బంధువుల జోరు, చుట్టాల హడావుడితో పెళ్లి సంబరాలు అంబరాన్ని తాకుతుంటాయి. ఇక చిన్న పిల్లల అల్లర్లు, పెద్దల కోలాహలం మధ్య వివాహ తంతు ముగుస్తుంది. అయితే ఇటీవల కాలంలో పెళ్లిళ్లు..
మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎంతో ఆనందంగా మన కళ్లముందు తిరిగిన వారు ఉన్నట్టుండి మృత్యువడిలోకి చేరుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల విహారయాత్రల్లో విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఘెర పరాభవం తర్వాత.. ఇంటా బయట సర్వత్రా విమర్శల వర్షం కురిసింది. ఇక పాక్ మాజీ క్రికెటర్లు ఎప్పుడెప్పుడు టీమిండియాను విమర్శిద్దామా అని ఎదురు చూస్తున్న క్రమంలో.. టీమిండియా ఘోర ఓటమి వారికి ఓ అద్భుత అవకాశంగా దొరికింది. దాంతో అక్తర్ తన అక్కసును వెల్లగక్కగా.. పాక్ ప్రధాని సైతం టీమిండియాపై ఉన్న ద్వేశాన్ని బయటపెట్టాడు. ట్వీటర్ వేదికగా ” అయితే ఈ ఆదివారం ఫైనల్లో 152/0, 170/0 […]
బ్రిటన్.. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఎదిగి.. ప్రపంచ దేశాలన్నింటిని పాలించింది.. శాసించింది. ఇక భారతదేశాన్ని సుమారు 200 ఏళ్ల పాటు పాలించింది. ఒకప్పుడు భారతీయులు అంటేనే చాలా చిన్నచూపు, చులకన భావం కలిగిన దేశానికి నేడు.. అదే భారతీయ మూలాలున్న ఓ హిందూ వ్యక్తి ప్రధానిగా ఎన్నికవ్వడం ఎంతటి విచిత్రమో కదా. దీపావళి పండుగ రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో.. భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రిషి సునాక్ ప్రస్థానం […]
సాధారణంగా ప్రతీ దేశానికి వారి వారి కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాల ప్రకారం కొన్ని చట్టాలను ప్రభుత్వాలు తీసుకొస్తాయి. కాలం మారుతున్న కొద్ది ఆచారాలు.. అలవాట్లు మారుతాయి. అయితే పాత చట్టాలు కొన్ని నేటి ఆధునిక కాలంలో పాతబడటమో లేక దేశ ప్రజలు దాన్ని వ్యతిరేకించడమో చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ఒక దేశం స్వలింగ సంపర్కం నేరం కాదు అంటూ ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో నరేంద్ర మోడీ ఆస్తుల విలువను పీఎంవో అధికారికంగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే.. మోడీ చరాస్తుల విలువ రూ. 26.13 లక్షలు పెరిగినట్లు పీఎంవో వెబ్సైట్ వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు విలువ రూ. 2.23 కోట్లు కాగా, ఎక్కువ శాతం బ్యాంక్ డిపాజిట్ల రూపంలో ఉంది. అయితే ఆయన పేరు […]
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ రాజకీయాలు ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలు, నాటకీయ పరిణామాల మధ్య ఈ ఓటింగ్ పూర్తయ్యింది. మొత్తానికి ఓటింగ్ ఫలిగంగా ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ వైదొలగాల్సి వచ్చింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. మొత్తం 174 […]
హైదరాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై స్పందించారు ప్రధాని మోదీ. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక మరణించిన 11 మంది కుటుంబాలకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున అందిస్తామని ప్రధాని ట్విట్టర్ లో తెలిపారు. ఇది కూడ చదవండి: సికింద్రాబాద్ లో ఘోరం.. భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం! ఈ ఘటనలో ఇంతమంది మరణించడం చాలా బాధకరమన్నారు. బుధవారం తెల్లవారుజాము 4 గంటలకు […]
దేశంలో భవిష్యత్లో “ప్రజాఫ్రంట్” రావాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆదివారం నాటి ప్రెస్మీట్ లో కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. దేశానికి కొత్త రాజకీయ పార్టీ అవసరం అని ప్రజలు కోరుకుంటే.. పార్టీ పెడతానని ప్రకటించారు. అంతేకాక దేశంలో రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే నిర్వహిస్తోందని, తెలంగాణలో కూడా పీకే టీమ్ సర్వే చేస్తున్నారని, ఇప్పటికే టీఆర్ఎస్ కూడా విడిగా సర్వేలు చేయిస్తోందని, పీకే సర్వే ఎలా ఉంటుందో చూస్తామని […]