మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు, మంచి పనులకు ముగ్దురాలై ప్రశంసలు కురిపించింది. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు కొడుకు లాంటివాడని.. తన పేరున ఉన్న 25 ఎకరాల భూమిని ప్రధాని మోదీకి రాసిస్తా..అని సంచలన ప్రకటన చేసింది.
మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారు. అవి పేద ప్రజలకు ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తోడ్పడతాయి. మోదీ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల్లో కొన్ని ముఖ్యమైన పథకాలు.. పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా.. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుటకు ‘జన్ ధన్ యోజన’, ఆరోగ్య రక్షణ కల్పించుటకు ‘ఆయుష్మాన్ భారత్ యోజన’, రైతులకు బీమాతోపాటుగా ఆర్థిక పథకం ‘పీఎం ఫసల్ బీమా యోజన, చిన్న వ్యాపారులకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించే నేపథ్యంతో పీఎం ముద్రా యోజన.. ఇవే కాకుండా ఆడపిల్లల కోసం ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నిరంతరం ప్రజల బాగు కోరుకునే ప్రధానిపై అభిమానం పెంచుకున్న వారు దేశంలో అనేక మంది ఉన్నారు. అలాంటి కోవకు చెందిన బామ్మ తాజాగా మధ్యప్రదేశ్‌లో ప్రధాని గురించి ఏమంటుందో తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన మంగీబాయి తన్వర్ అనే వృద్ధురాలు మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు, మంచి పనులకు ముగ్దురాలై ప్రశంసలు కురిపించింది. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు కొడుకు లాంటివాడని.. తన పేరున ఉన్న 25 ఎకరాల భూమిని ప్రధాని మోదీకి రాసిస్తా..అని సంచలన ప్రకటన చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంగీబాయికి 14 మంది సంతానం కాగా.. మోదీ తన 15వ కొడుకులా భావిస్తానని ఆమె అంటున్నది. దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని.. తన ఓటు మోదీకే వేస్తానని వెల్లడించింది. తనతో పాటుగా దేశంలోని చాలామంది వృద్దులను ఆదుకుంటున్నారని మోదీని ప్రశంసించింది. వందేళ్ల బామ్మ మోదీని గుర్తుపట్టగలవా అని అక్కడి స్థానికులు ప్రధాని ఫొటో చూపించి అడుగగా ‘అవును.. ఇతడే మోదీ.. నాకు తెలుసు.. టీవీల్లో చూశాను’ అంటూ జవాబిచ్చింది.
‘మోదీ తనకు ఇల్లు ఇచ్చి.. ఉచితంగా వైద్యం అందజేస్తున్నారని.. వితంతు పింఛను ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్నారని.. ఆహారం అందిసతున్నారని.. అందుకే మోదీ తన కుమారుడు అని.. ఛాన్స్ ఉంటే ప్రధానిని స్వయంగా కలవాలని ఉంది’ అని మంగీబాయి తెలిపింది. ప్రధాని మంగళవారం మధ్యప్రదేశ్ లో పర్యటించనున్న వేళ ఈ వీడియో వైరల్ కావడం గమనించదగ్గ విషయం. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాని భోపాల్ రోడ్ షోలో పాల్గొని.. పలు అభివృద్ది కార్యక్రమాలుప్రారంభించనున్నారు.
An 100 years old lady from Rajgarh, Madhya Pradesh says she will give her 25 bighas land to PM Narendra Modi as he is her son.
She said her vote will also go to BJP/Modi as he is providing free medical treatment. pic.twitter.com/HetDyTCDCv
— News Arena India (@NewsArenaIndia) June 25, 2023