మేళ తాళాలు, సన్నాయి హోరు, పచ్చని పందిళ్లు, సరదాలు, సరాగాలు, బంధువుల జోరు, చుట్టాల హడావుడితో పెళ్లి సంబరాలు అంబరాన్ని తాకుతుంటాయి. ఇక చిన్న పిల్లల అల్లర్లు, పెద్దల కోలాహలం మధ్య వివాహ తంతు ముగుస్తుంది. అయితే ఇటీవల కాలంలో పెళ్లిళ్లు..
పెళ్లంటే నూరేళ్ల పంట అనేది సామెత. జీవితంలో జరిగే ఓ అద్భుతమైన ఘట్టం ఇది. మేళ తాళాలు, సన్నాయి హోరు, పచ్చని పందిళ్లు, సరదాలు, సరాగాలు, బంధువుల జోరు, చుట్టాల హడావుడితో పెళ్లి సంబరాలు అంబరాన్ని తాకుతుంటాయి. ఇక చిన్న పిల్లల అల్లర్లు, పెద్దల కోలాహలం మధ్య వివాహ తంతు ముగుస్తుంది. అయితే ఇటీవల కాలంలో పెళ్లిళ్లు.. కొన్ని పెళ్లి పీటల మీదే పెటాకులు అవుతున్నాయి. ఎక్కువ కట్నం అడిగారని నిర్మోహమాటంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నారు అమ్మాయిలు. అయితే ఈ వరుడి విషయం కాస్త డిఫరెంట్. కొత్తగా పెళ్లైన వరుడు..అత్తారింటికి వెళ్లగా.. ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదన్న కారణంగా అతడితో పెళ్లిన రద్దు చేసుకోవడమే కాకుండా.. అతడి సోదరుడిని రెండో వివాహం చేసుకుంది వధువు.
ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే..నసీర్‌పూర్ గ్రామానికి చెందిన శివశంకర్‌రామ్‌కు కరందలోని బసంత్ పట్టిలో నివాసం ఉంటున్న యువతి రంజనతో వివాహం ఈ నెల 11న వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఊరేగింపుగా వధువు ఇంటికి వచ్చాడు వరుడు. మరుసటి రోజు ఏర్పాటు చేసిన ఓ వేడుకలో బావ మరిది, మరదలుతో మాటలు కలిపాడు వరుడు. ఈ క్రమంలో మరదలు ఓ ప్రశ్న వేసింది బావ శివకు. దేశ ప్రధాని ఎవరు అని ప్రశ్నించింది. దీనికి వరుడు సమాధానం చెప్పలేకపోయాడు. అతడు ఆన్సర్ చేయకపోవడంతో అక్కడ ఉన్నవారందరూ నవ్వారు. ఇది కూడా తెలియదా అంటూ ఎగతాళి చేశారు.
బంధువులు హేళన చేయడంతో ఆ యువతి పెళ్లిని రద్దు చేసుకుంది. వెంటనే అతడి తమ్ముడైన అనంత్ను పెళ్లి చేసుకుంది. అయితే అనంత్ ఆమె కంటే చిన్నవాడు కావడం గమనార్హం. అయితే తన చిన్న కొడుకును భయపెట్టి బలవంతంగా పెళ్లి చేశారని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తండ్రి తెలిపారు. జూన్ 13న వధువు తరపు వారు అకస్మాత్తుగా తన ఇంటికి వచ్చి.. గొడవపెట్టుకున్నారని ఆయన వెల్లడించాడు. జూన్ 17న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సైద్‌పూర్ కొత్వాల్ వందనా సింగ్ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు అందిన తర్వాత జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.