రాజకీయ నాయకులు, సెలబ్రిటీల పిల్లలు అంటే వారికి కూడా క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. ప్రైవసీ దొరకడం కూడా చాలా కష్టమే. ఇక వారికి బ్యాగ్రౌండ్ ఎంత ఎక్కువ ఉంటుందో.. పాపులారిటీ కూడా అదే విధంగా ఉంటుంది. ఇవన్ని ఒక్క ఎత్తయితే.. ఇక వారి తల్లిదండ్రుల పేరు,ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని.. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తమ ప్రవర్తనతో ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. కాదని హద్దులు దాటి ప్రవర్తిస్తే.. వారితో పాటు.. వారి తల్లిదండ్రులు కూడా బాధ్యులు కావాల్సి వస్తుంది. పిల్లలు చేసే పనులకు తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి వస్తుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె.. తన మాట వినలేదని.. ఓ డాక్టర్‌పై దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటనతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో కూతురు చేసిన పనికి తండ్రి క్షమాపణలు చెప్పాడు. ఆ వివరాలు..
మిజోరాంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె మిలారి చాంగ్టే.. కొన్ని రోజుల క్రితం వైద్య పరీక్షల నిమిత్తం.. డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్లింది. అయితే, అపాయింట్మెంట్ లేకుండా పరీక్షించేది లేదని ఆ డాక్టర్ తేల్చి చెప్పాడు. క్లినిక్ మూసివేసే లోపు అపాయింట్మెంట్ తీసుకోవాలని మిలారి చాంగ్టేకు సూచించాడు. సీఎం కుమార్తెను అయినప్పటికి.. తననే వెయిట్ చేయమంటారా అని ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది. నన్నే అపాయింట్మెంట్ తీసుకోమంటావా అని డాక్టర్‌పై దాడి చేసింది మిలారి. అక్కడున్న వారు ఆపేందుకు ప్రయత్నించినా ఆమె ఆగలేదు. డాక్టర్ ముఖంపై పిడి గుద్దులు కురిపిస్తూనే ఉంది మిలారి.
ఈ క్రమంలో మిలారి సీఎంపై దాడి చేసిన వీడియో సోసల్ మీడియాలో వైరల్‌గా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దాడి నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిజోరాం విభాగం వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. దీంతో దిగొచ్చిన ముఖ్యమంత్రి జోరంతంగా.. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా బహిరంగ క్షమాపణలు కోరారు. తాను స్వయంగా రాసిన క్షమాపణ పత్రాన్ని పోస్ట్ చేశారు. తన కుమార్తె అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లు చెప్పారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Video: Mizoram Chief Minister’s @ZoramthangaCM Daughter Hits Doctor, Father Says Sorry @SupriyaShrinate @Ashok_Kashmir pic.twitter.com/5f0EJ2RshZ
— Danish Chaudhary (@LaBelleDame7) August 21, 2022