సాధారణంగా జనాలు ఫ్రీగా వస్తే దేన్నీ కూడా వదలరు.. అది మంచా, చెడా అన్న విషయం ఏ మాత్రం పట్టించుకోరు. చాలా సార్లు రోడ్లపై వాహనాలు బోల్తా పడటం.. వాటిలో ఉన్న వస్తువులను క్షణాల్లో లూటీ చేయడం చూస్తూనే ఉన్నాం. ఓ చోట వందలాది మంది మార్టులోకి ప్రవేశించి వస్తువలన్నీ దోచుకెళ్లారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 7-ఎలెవెన్ ఓ మార్టు లో ఒకేసారి వందలాది మంది మార్టులోకి ప్రవేశించారు. వారంతా షాపులో ఉన్న సిబ్బందిని బెదిరించి అందినకాడికి వస్తువులు దోచుకు వెళ్లారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది ఒకేసారి దోచుకు పోవడంతో పోలీసులకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. నింధితులను పట్టుకునేందుకు నగర ప్రజలు సహాయం కోరారు పోలీసులు. ఈ వారం ప్రారంభంలో దుకాణంలో వందల కొద్ది జనాలు 7-ఎలెవెన్‌లోకి పరుగులుతీశారు. తర్వాత దుకాణంలో వస్తువులన్నీ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కౌంటర్ మీదుగా వెళ్లి అక్కడ వస్తువులను పట్టుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. WATCH: Police in Los Angeles have released footage showing a crowd ransacking a 7-Eleven and have asked for the public’s help identifying people involved. The LAPD said they believed the “‘flash mob of looters” formed after a so-called street takeover. pic.twitter.com/vChMBOfP7Y — Newsmax (@newsmax) August 19, 2022 ఇది కూడా చదవండి: పాపం.. ఎంత కష్టం వచ్చిందో..! కంట కన్నీరు తెప్పిస్తున్న వృద్ధ దంపతుల నిర్ణయం!