ఆయన పేరు పాపన్న, ఆమె పేరు వెంకటలక్ష్మమ్మ. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఈ వృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుతుళ్లు. పెంచి పెద్ద చేసి అందరికీ పెళ్లిళ్లు చేశారు. వయసు మీద పడుతున్న ఈ దంపతులు మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా గడపాల్సింది పోయి అందరి కంట కన్నీరు తెప్పించేలా నిర్ణయం తీసుకుని ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వృద్ధాప్యం వయసులో ఆనందంగా గడపాల్సిన ఈ భార్యాభర్తలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఒకేసారి బలవన్మరణానికి పాల్పడటానికి దారి తీసిన దారుణ పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జిల్లాలోని గోరంట్ల మండలం ఐనవోలు గ్రామానికి చెందిన పాపన్న, వెంకటలక్ష్మమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లతో పాటు ఇద్దరు కుమారులు జన్మించారు. ఉన్నఊరిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించారు. పిల్లలు కోరిందల్లా ఇచ్చారు, కోరనివి కూడా కొనిచ్చారు. వాళ్లు పస్తులుండైన సరే పిల్లలకు పెట్టి పెద్ద చేశారు. అనంతరం పిల్లలకు వయసు రాగానే నలుగురికీ పెళ్లిళ్లు చేశారు. మనవళ్లు, మనవరాళ్లు పుట్టారు. జీవితంలో చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి పుట్టిన మనవరాళ్లతో సంతోషంగా జీవిస్తున్నారు అనుకుంటే పొరపాటే. వయసు మీద పడుతున్న కొద్ది వీరికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరావి. కనిపెంచిన కూతుళ్లు, కొడుకులున్నా.., ఆదరించేవారు వారు లేరు, ఆలనా పాలన చూసుకునేవారు లేరు. ఉన్ననాడు తిని లేనినాడు పస్తులున్నారు. ఈ క్రమంలోనే గత మూడేళ్ల కిందట పాపన్నకి కంటి సమస్య రావడంతో అక్కడక్క ఆస్పత్రుల చుట్టు తిరిగారు. ఒకరికొకరు తోడుండడంతో భార్య వెంకటలక్ష్మమ్మ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఇలా వీరి జీవితం గడుస్తున్న సమయంలో భార్య వెంకటలక్ష్మమ్మకు కూడా కంటి సమస్య వచ్చింది. కనిపెంచిన పిల్లలున్నా ఎవరు వచ్చి చూసిన పాపన పోలేదు. దీనినే గుర్తు చేసుకుంటూ భార్యాభర్తలిద్దరూ కన్నీటి సంద్రంలో మునిగిపోయేవారు. ఇద్దరికీ కంటి సమస్యలు రావడంతో ఈ వృద్ధ దంపతులు తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే చనిపోవాలని నిర్ణయం తీసుకుని గురువారం పురుగుల మందు తాగి భార్యాభర్తలిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. కనిపెంచిన కూతుళ్లు, కొడుకులున్నా.., పట్టించుకునేవారే కరువయ్యారన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ ఈ వృద్ధ దంపతుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: తప్పని పరిస్థితుల్లో మహిళ నగ్నంగా వీడియో కాల్.. ఫైనాన్స్ వ్యాపారి ఏం చేశాడో తెలుసా?