కృష్ణా జిల్లాలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. డబ్బులు ఇస్తానని మాటిచ్చిన ఓ ఫైనాన్స్ వ్యాపారీ బరితెగించి ఓ మహిళతో నగ్నంగా వీడియోలు చేయించుకున్నాడు. ఇంతటితో ఆగకుండా ఆ వీడియో కాల్ ను స్క్రీన్ రికార్డ్ చేసి ఓ వెబ్ సైట్ లో పోస్ట్ చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ కు చెందిన ఓ మహిళ స్థానికంగా నివాసం ఉంటుంది. అయితే ఆ మహిళకు ఇటీవల డబ్బు అవసరం ఉండడంతో స్థానికంగా ఉండే హన్సకుమార్ అనే ఫైనాన్స్ వ్యాపారీని ఆశ్రయించింది. ఇస్తానని మాటిచ్చిన ఆ వ్యాపారీ ఓ షరతు విధించాడు. అదేంటంటే? నాకు నువ్వు నగ్నంగా వీడియో కాల్ చేయాలని, అలా చేస్తేనే నీకు డబ్బు ఇస్తానని చెప్పాడు. కాస్త వెనకడుగేసి ఆలోచించిన ఆ మహిళ డబ్బు కావాలంటే తప్పని పరిస్థితుల్లో ఈ పని చేయక తప్పదేమోనని నిర్ణయం తీసుకుంది. ఇక చివరికి అతను కోరినట్లుగానే నగ్నంగా వీడియోలు కాల్ చేసింది. ఈ దుర్మార్గుడు ఇంతటితో ఆగకుండా ఆ మహిళ చేసిన వీడియో కాల్ ను స్రీన్ రికార్డ్ చేశాడు. ఆ స్క్రీన్ రికార్డ్ వీడియోను విజయవాడలో ఉన్న తమ బంధువుకు పంపాడు. ఇతగాడు ఏకంగా ఆ వీడియోను ఓ వెబ్ సైట్ లో పెట్టి ఆ మహిళతో బ్లాక్ మెయిల్ కు దిగాడు. అతని వేధింపులను తట్టుకోలేకపోయిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ప్రేమ పేరుతో నమ్మించి డిగ్రీ యువతికి కడుపు చేశాడు.. అబార్షన్ కు మాత్రలు ఇచ్చి!