రాజకీయ నాయకులు, సెలబ్రిటీల పిల్లలు అంటే వారికి కూడా క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రైవసీ దొరకడం కూడా చాలా కష్టమే. ఇక వారికి బ్యాగ్రౌండ్ ఎంత ఎక్కువ ఉంటుందో.. పాపులారిటీ కూడా అదే విధంగా ఉంటుంది. ఇవన్ని ఒక్క ఎత్తయితే.. ఇక వారి తల్లిదండ్రుల పేరు,ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని.. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తమ ప్రవర్తనతో ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. కాదని హద్దులు దాటి ప్రవర్తిస్తే.. వారితో పాటు.. వారి తల్లిదండ్రులు కూడా బాధ్యులు కావాల్సి […]
మన దేశంలో సినిమా హీరలకు, క్రీడాకారులకు ధీటుగా రాజకీయ నాయకులకు కూడా ఓ రేంజ్‌లో అభిమానులుంటారు. ఇక తమ ప్రియతమ నేతపై తమకు ఎంత అభిమానం ఉందో చాటుకోవడానికి విభిన్న ప్రయత్నాలు చేస్తారు. కొందరు పూజలు నిర్వహిస్తే.. మరి కొందరు పాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపడతారు. ఇప్పుడ మీరు చదవబోయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. ఇక్కడ ఓ యువకుడు కేటీఆర్ సీఎం కావాలని పాద యాత్ర చేస్తున్నాడు. దీనిలో విడ్డూరం ఏం ఉంది అంటే […]
CM : ఒరిస్సా రాష్ట్రంలో గురువారం స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9.10 గంటలకు ఓ సాదాసీదా ఓటరుగా కాలినడకన 53వ వార్డులోని ఏరో డ్రామ్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. 544వ నంబర్ పోలింగ్ బూత్‌లో బీఎంసీ మేయర్, కార్పొరేటర్‌లకు ఓటు వేశారు. నవీన్ నివాసం నుంచి 300 మీటర్ల దూరంలో ఈ పోలింగ్ కేంద్రం ఉంది. దీంతో ఆయన సాధారణ రక్షణ […]
రెండు దశాబ్దాల ప్రస్థానంతో సాగుతున్న గులాబీ పార్టీ మరో మైలు రాయిని చేరడానికి సిద్ధం అవుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో జన ప్రభంజనమై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలకులను వణికించిన చరిత్ర టీఆర్ఎస్‌ది. ‘తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయం’ ఏర్పాటు చేస్తున్నారు. 2020 అక్టోబర్ 9న 11 వందల చదరపు మీటర్ల భూమిని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి కేంద్రం కేటాయించింది. పార్టీ ఆఫీస్ భూమి కోసం టీఆర్‌ఎస్ […]
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక సందర్భంగా సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యం, మాంసం అమ్మకాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆగస్టు 30న ఆదేశాలు జారీ చేశారు.లక్నోలో జరిగిన కృష్ణోత్సవ్ 2021 కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. సందర్భంగా ప్రసంగించిన ఆయన మద్యం, మాంసం వ్యాపారం చేసే వారు తమ వ్యాపారాన్ని మార్చుకోవాలని అన్నారు. హిందువులంతా మధురను శ్రీమహా […]
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అభిమానులు గుడి కట్టారు. కాగా, ఏపీ సీఎం జగన్ కు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. నవరత్నాల పేరుతో ఈ ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయంలో రైతు భరోసా పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి పథకాలు పేరుతో స్థూపాలు కూడా నిర్మించారు. పేదలకు ఇళ్లు, ఫీజ్ రియంబర్స్ మెంట్ అంటూ భారీ స్తూపాలను ఏర్పాటు చేశారు. గుడిలో నవరత్నాల సృష్టికర్త […]
బెంగళూరు కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మైను బీజేపీ ఎంపిక చేసింది. పార్టీ శాసనాసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాజీనామా చేసిన కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు బసవరాజ్.ఇంజినీరింగ్ చదువుకున్న ఆయన టాటా గ్రూప్‌లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి హావేరి జిల్లాలోని షిగ్గాన్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయభేరి మోగించారు. ఇప్పుడు కర్ణాటక కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.సుమారు 32 […]
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వైవి సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే,సీఎం జగన్ మాత్రం ఆయనను రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్పొరేషన్ […]
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను పొడగిస్తూ రాష‌్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుతున్నా పూర్తిగా అదుపులోకి రాలేదు. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగియడంతో […]
హైదరాబాద్- ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను ఆశాఖ నుంచి తప్పించిన వెను వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు చెప్పారు. ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రెమ్‌డెసివర్, వాక్సీన్, ఆక్సీజన్, ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో గానీ ఏ మాత్రం లోపం రానీయవద్దని […]