ప్రస్తుతం సామాన్యుడు మార్కెట్ లోకి వెళ్లి ఏది కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం తర్వాత సామాన్యులు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది.. దానికి తోడు నిత్యం పెరుగుతున్న ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారుతున్నాయి. గ్యాస్, ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి.
కరోనా ప్రభావంతో సామాన్యుడి ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యింది.. దీనికి తోడు ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధర ఆకాశానంటుతున్నాయి. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ప్రతి నిత్యం పెరుగుతన్న ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారుతున్నాయి. ఇప్పటికే పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరల పెరిగి సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే.. సామాన్యులపై మరో భారం పడనుంది. దేశంలో మందుల ధరలు పెరగనున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం సామాన్యుడి పరిస్థితి మార్కెట్ లో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్న చందంగా మారిపోయింది. వంటింటి సామాన్లు నుంచి మొదలు నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు మెడిసన్స్ ధరలు కూడా పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి వినియోగదారులపై అదనపు భారం పడనుంది. కరోనా కాలంలో మెడిసిన్స్ ధరలకు భారీగా డిమాండ్ పెరిగిపోయాయి. ఒక్క డోలో – 650 టాబ్లెట్స్ కరోనా కాలంలో 350 కోట్లకు పైగా అమ్ముడు పోయాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు. ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు 12 శాతం పెరగనున్నాయి. అసలు నిత్యవసర సరుకులు ధరలు భగ్గుమంటుంటే.. ఇప్పుడు మందుల ధరలు కూడా పెరుగుతాయి అన్న వార్త సామాన్యుడి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
ఏప్రీల్ 1 నుంచి ఫీవర్, బీపీ, డయాబెటీస్, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, అనీమియా తదితర చికిత్సలకు వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్, యాంటీ ఇన్ఫెక్టివ్స్, యాంటీబయాటిక్స్ తో పాటు కార్డియాక్ మందుల ధరలు సైతం పెరగనున్నాయి. అయితే మందుల ధరలు పెరగడం ఇది వరుసగా రెండోసారి అంటున్నారు. ఈ మెడిసన్ ధరల పెంపు ప్రభావం జాతీయ నిత్యావసర మందుల జాబితాలోని 800 కు పైగా మందులపై పడనున్నట్లు సమాచారం. షెడ్యూల్ చేసిన మందులకు 10 శాతం పైగా పెంచడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ముడి పదార్థాలే ప్రధానంగా ఈ ధరల పెంపునకు కారణం అని బిలాయ్ కి చెందిన కెమిస్ట్ అయిన రాజేశ్ గౌర్ అన్నారు.
ఇటీవల ఔషదాల్లో వినియోగించే ముడి పదార్థాలు, ఏపీఐ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో.. రవాణా, ప్యాకింగ్ ధరలు పెరిగాయి.. ఈ కారణం చేతనే గరిష్ట అమ్మకం ధర 12 శాతం పెరగనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కంపెనీలకు ఊరగ కలిగినా.. సామాన్యులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతుండగా ఇప్పుడు మందుల ధరలు కూడా పెరుగుతుండటంతో జనరిక్ మందుల షాపుల సంఖ్య పెంచాలని సాధారణ మందుల ధరలు పెంచొద్దని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.