ప్రస్తుతం సామాన్యుడు మార్కెట్ లోకి వెళ్లి ఏది కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం తర్వాత సామాన్యులు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది.. దానికి తోడు నిత్యం పెరుగుతున్న ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారుతున్నాయి. గ్యాస్, ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి.
డ్రోన్ల వినియోగం బహుముఖ రీతిలో విస్తరిస్తోంది. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఔషధాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఎక్కడో కాదు మన తెలంగాణలోనే. సరిగ్గా రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు, తండాలకు డ్రోన్‌ల ద్వారా మందులు సరఫరా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. వికారాబాద్ జిల్లాలో రవాణా సదుపాయాలు లేని మారుమూల అటవీప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందులను తరలించనున్నారు. ఈ పథకానికి ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై‘ అని పేరుపెట్టారు. వికారాబాద్ లో జరిగిన ఓ […]