మత్తు పదార్థాలు, వ్యసనాలకు బానిసలై.. జీవితాలు తల కిందులవుతున్నా యువత పెడదారి పడుతూనే ఉన్నారు. అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మత్తు పదార్థాల విక్రయం జోరుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విక్రయాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వ్యాపారం ముసుగులో మత్తు ఇంజెక్షన్లను అమ్ముతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరంలో వెలుగు చూసింది. మత్తు ఇంజెక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని బుధవారం దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటకొచ్చింది. తుక్కు వ్యాపారం మాటన […]
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రోజు రోజుకు డ్రగ్స్ ముఠా ఆగడాలు శృతిమించిపోతున్నాయి. డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పడు విస్తృత్తంగా తనిఖీలు చేపడుతూ డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, పలువురిని అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ శివార్లలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగర శివార్లలోని వనస్థలిపురంలో 180 గ్రాముల కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ను […]
డ్రగ్స్ మాఫీయా ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వివిధ మార్గాల్లో దేశంలోకి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ ముఠాను ఎప్పటికప్పుడు పట్టుకుని అరెస్టు చేస్తున్నా… కొత్త మార్గాల్లో ఈ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా కమల పండ్ల మాటున దాదాపు వెయ్యి కోట్లు విలువ చేసే డ్రగ్స్ సరఫరా చేస్తుండగా అధికారులు గుర్తించారు. ముంబైలో కమల పండ్లను దిగుమతి చేసే ట్రక్ లో సుమారు రూ.1476 కోట్ల విలువైన మెథాం ఫేటమిన్, […]
హైదరాబాద్‌ని డ్రగ్ ఫ్రీ సిటీగా మారుద్దామని ఒక పక్క పోలీసులు కలలు కంటుంటే.. కొంతమంది పోలీసుల కళ్ళు కప్పి డ్రగ్స్ దందాలు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహిస్తూ డ్రగ్ ముఠాలని అంతమొందిస్తున్నారు. తాజాగా పోలీసుల కళ్ళు కప్పి ప్లాట్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దొమ్మరాజు గోపీకృష్ణ యథేచ్చగా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. హఫీజ్‌పేట్ గోకుల్ ప్లాట్స్‌లో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తుండగా గోపీకృష్ణను మాదాపూర్ […]
‘మంచి పని చేయాలంటే ఒకటే మార్గం ఉంటుంది.. కానీ, చెడ్డ పని చేయాలంటే అనేక మార్గాలు ఉంటాయి’ ఈ సామెత డ్రగ్స్ ముఠాలకు సరిగ్గా సరిపోతుంది. పోలీసులు ఎంత నిఘా వేసినా అడ్డదారుల్లో స్మగ్లర్లు.. డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నారు. స్మగ్లర్లు.. డ్రగ్స్ చేరవేస్తున్న తీరు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ‘వీడొక్కడే’, ‘పుష్ప’ సినిమాలను ఆదర్శంగా తీసుకుంటున్న స్మగ్లర్లు.. ఎవరికీ అనుమానం రాని రీతిలో డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్నారు. అయితే వారి పాపం పండి, పోలీసులకు పట్టుబడ్డారు. […]
విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన యూనివర్సిటీలు అసాంఘిక కార్యకలాపాలకు నెలవులుగా మారుతున్నాయా? అంటే.. కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన వివరాలను గమనిస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పెడదారిన పడుతున్నారనే వార్తలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. యూనివర్సిటీ ప్రాంగణాన్ని చెడు పనులకు ఉపయోగిస్తున్నారనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్ వెనుక యూనివర్సిటీ ఏరియాను […]
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిలో డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పలువురు ప్రముఖులకు సంబంధించిన వ్యక్తులు ఉండటం అనేది హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు చిత్ర సీమకు చెందిన నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను కూడా పోలీసులు విచారించి పంపారు. ఈ క్రమంలో జరిగిన సంఘటనపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. హోటల్‌లో జరిగిన […]
రాష్ట్రంలో గత కొంత కాలంగా డ్రగ్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఈ మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి హెచ్చరించినా పబ్‌ల నిర్వాహకులు వినడం లేదు. నాలుగు రోజుల క్తిరం డ్రగ్స్‌కు బానిసై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. అయినా మార్పు రావడం లేదు. ఇది కూడా చదవండి: బంజారాహిల్స్‌లో భారీ రేవ్ పార్టీ.. పోలీస్ అదుపులో బిగ్ బాస్ విజేత? […]
DRUGS : హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. డ్రగ్స్‌కు బానిసై ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇతడు తరచూ గోవా వెళ్లి డ్రగ్స్ తీసుకునేవాడు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌కు అలవాటు పడి రోగిగా మారాడు. వారం రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఇలా డ్రగ్స్‌కు బానిపై ఓ వ్యక్తి మరణించటం హైదరాబాద్ నగరంలో ఇదే తొలిసారి. విద్యార్థి మరణంతో రంగంలోకి దిగిన పోలీసులు గోవానుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న యువకులను అరెస్ట్ చేశారు. చనిపోయిన […]
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న కేటుగాళ్లను నార్కోటిక్ వింగ్ అరెస్ట్ చేసింది. డ్రగ్స్ విక్రయిస్తున్న 12 మందిని.. డ్రగ్స్ సేవిస్తున్న మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 13 మంది కోసం గాలిస్తున్నారు. ఎన్ఎండీఏ, ఎల్ఏఎస్డీ తో పాటు.. హాష్‌ఆయిల్, గంజాయి సీజ్ చేశారు. ఎస్ఆర్ నగర్, కార్కానా, సికింద్రాబాద్‌లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ సీవీ […]