దేశంలో ఈ మద్య పెళ్లి మండపాల్లో ఎన్నో రకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి కొద్దక్షణాల్లో ఉండగా ఇరు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి పెళ్లి క్యాన్సిల్ కావడం.. కట్నం కోసం, వధూ-వరుడు నచ్చకపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల పెళ్లిళ్లు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి.
ఈ మద్య పెళ్లి మండపాల్లో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి ముహూర్తం సమయంలో వరుడు అదనపు కట్నం కోరడంతో అతనిపై చేయి చేసుకున్న మామ, పెళ్లి కూతురు నచ్చ మండపం నుంచి పారిపోయిన వరుడు, మద్యం సేవించి వచ్చిన వరుడిని చూసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు ఇలా ఎన్న సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారి పెళ్లి ఉండగా వధువు తన ప్రియుడితో జంప్ అయ్యింది. దీంతో అవమానం భరించలేక ఆమె సోదరులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
బీహార్ లోని పుర్నియా లోని పెళ్లికి ఒక రోజు ముందు పెళ్లి కూతురు ప్రియుడితో జంప్ అయ్యింది. వధువు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాటు పూర్తి చేసుకున్నారు.. పసుపుతో గోరింట ఆచారం సైతం పూర్తయ్యింది. తెల్లరితే పెళ్లి అనగా వధువు పథకం ప్రకారం తన ప్రియుడితో పారిపోయింది. అంతేకాదు గుడిలో తన ప్రియుడిని పెళ్లి చేసుకొని దానికి సంబంధించిన వీడియో, ఫోటోలు వాట్సాప్ ద్వారా కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసింది. కూతురు చేసిన పనికి పదిమంది ముందు కుటుంబ సభ్యులు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో యువతి సోదరుడు తన సోదరి బతికి ఉండగానే పిండ ప్రధానం చేశారు. అంతేకాదు కోపంతో తన సోదరి దిష్టిబొమ్మ తయారు చేసి పాడెపై అలంకరించి ఆమె ఫోటోలను దానిపై ఉంచాడు ఊరేగింపుగా శ్మశాన వాటికకు వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశాడు.
బీహార్ పూర్ణియాలోని స్వీటీ అనే ఇంటర్ విద్యార్థినికి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి నిశ్చయం అయ్యింది. స్వీటీ కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాటు పూర్తి చేశారు. మరుసటి రోజు పెళ్లి ఊరేగింపుగా రావాల్సి ఉంది. ఇంతలో స్వీటీ కనిపించకుండా పోయింది. వాస్తవానికి కొంతకాలంగా స్వీటికి అదే గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక స్వీటీ తన ప్రియుడితో పారిపోయింది. స్వీటీ కుటుంబ సభ్యులు అరుణ్ పై కిడ్నాప్ కేసు పెట్టారు. అయితే స్వీటీ తన ప్రేమికుడితో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కుటుంబ సభ్యులు పెట్టిన కేసు తప్పు అని.. తన ఇష్టపూర్వకంగానే అతని వెంట వెళ్లానని.. పెళ్లి చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. ఈ ఘటన గ్రామంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.