వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇళ్లలోకి పాములు, తేళ్లు చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బయట ఉండాల్సిన విషసర్పాలు ఇంట్లో కళ్ల ముందే కనిపిస్తే ఇక ఆ ఇంట్లో వారి టెన్షన్ అంతా ఇంతా కాదు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ ఇంట్లో వెలుగుచూసింది. శివమొగ్గ శివారులోని బొమ్మానకట్టెలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రం మంజప్ప అనే వ్యక్తి మంగళవారం ఉదయం ఇంటి బయట ఉంచిన షూ వేసుకోవడానికి ప్రయత్నించగా.. అందులో నుంచి బుసలు కొడుతూ ఓ నాగుపాము పడగ విప్పింది. దీంతో భయభ్రాంతులకు గురైన కుటుంబసభ్యులు వెంటనే బయటకు పరుగు తీశారు. పాము గురించి స్నేక్ కిరణ్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కిరణ్ పామును జాగ్రత్తగా బయటకు తీసి గ్రామానికి దూరంగా తీసుకెళ్లి వదిలివేశాడు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరుకున్న సమయంలో పాములు, తేళ్లు వెచ్చగా ఉండటానికి ఇలా షూస్ లో దాక్కుంటాయి. అందుకే షూ వేసుకునే సమయంలో తప్పకుండా చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.