కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. కూతురిని తండ్రి ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర దింపి వెళ్లాడో లేదో రెప్పపాటులో అందరూ చూస్తుండగా రైలు ఢీ కొని ప్రాణాలు కోల్పోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హాసన్ పరిధిలోని అంక్ పూర్. ఇదే గ్రామంలో ప్రీతిపుట్ట స్వామి అనే 22 ఏళ్ల యువతి నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదువుతుంది. అయితే ఇటీవల ఆ యువతి తండ్రి కూతురిని ఆటోలో స్థానికంగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర వదిలి వెళ్లాడు. అప్పుడే ఆ యువతి మెల్లగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాటే ప్రయత్నం చేసింది. అయితే ఈ క్రమంలోనే పట్టాలు దాటుతుండగా ఆమె కాలు రైలు పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలోనే వేగంగా దూసుకొచ్చిన రైలు ఆమెను ఢీ కొట్టడంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అందరూ చూస్తుండగా వారి కళ్ల ముందే ఆ యువతి శరీరం మొత్తం చిద్రమైపోయింది. ఈ సీన్ ను చూసి అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రైల్వే అధికారుల నిర్లక్షం కారణంగానే యువతి ప్రాణాలు పోయిందంటూ స్థానికులు కోపంతో ఊగిపోయి కొద్ది సేపు నిరసనలు తెలియజేశారు. కూతురి మరణ వార్త విన్న ఆ యువతి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: బీటెక్ చదువుతున్న యునీలా ఇలా చేస్తుందని ఎవరూ ఊహించరు!