ఒక గ్రామ సర్పంచ్ కరెన్సీ నోట్ల దండలోని డబ్బులను వెదజల్లాడు. అయితే ఆయన డబ్బులు ఎక్కువయ్యో.. ఏ ఉత్సవం సందర్భంగానో ఇలా చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని చర్యలు చేపట్టినా అవినీతి, లంచం మన దేశాన్ని వీడటం లేదు. ఇప్పటికీ పలు సర్కారు ఆఫీసుల్లో ఏదైనా పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందే. కొందరికి లంచం పుచ్చుకోనిదే ఏ పని చేయబుద్ధి కాదు. దీనికి ఎందరో పేద, మధ్యతరగతి ప్రజలు బలవుతున్నారు. లంచం ఇచ్చుకోలేక ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లకు ఉన్న చెప్పులు అరిగేలా తిరుగుతూ అరిగోస పడుతున్నారు. మహారాష్ట్రలోని శంబాజీనగర్ జిల్లా, పులంబ్రీ పంచాయతీ సమితి పరిధిలోని గోవరాయ్ పయాగ్ గ్రామ ప్రజలది ఇదే దుస్థితి. ఆ గ్రామానికి 20 వ్యవసాయ బావులు మంజూరయ్యాయి. ఒక్కో బావికి సుమారు రూ.4 లక్షలు కేటాయించారు. వాటి పనులు మొదలుపెట్టాలంటూ ఆ గ్రామ సర్పంచ్ మంగేష్ సాబడే పలుమార్లు బీడీవో (బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్) జ్యోతి కవడదేవిని కోరారు.
అయితే ఒక్కోబావికి రూ.48 వేలు ఇవ్వాలని జ్యోతి డిమాండ్ చేశారు. రైతులంతా పేదోళ్లని.. సర్పంచ్ ఎంత వేడుకున్నా ఆమె అస్సలు కనికరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన మంగేష్ రూ.100, రూ.500 నోట్లతో రూ.2 లక్షల దండ మెడలో వేసుకొని శుక్రవారం సమితి కార్యాలయం ఎదుట ఆ డబ్బు వెదజల్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీన్ని రాష్ట్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. మంత్రి గిరీష్ మహాజన్ బీడీవో జ్యోతిని వెంటనే సస్పెండ్ చేసి, దర్యాప్తునకు ఆదేశించారు. తాను వెదజల్లిన డబ్బు రైతుల నుంచి సేకరించిందేనని.. ఆ మొత్తాన్ని కూడా బీడీవో నుంచి వసూలు చేసి ఇప్పించాలని సర్పంచ్ మంగేష్ కోరారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mangesh Sabale, a sarpanch of a village in #ChhatrapatiSambhajinagar (#Aurangabad), #Maharashtra, chose a unique mode of protest against an officer who was seeking a bribe to approve wells in his village. He threw notes worth Rs 2 lakh in the premises of the Fulambri Panchayat + pic.twitter.com/o0zsFQlxhN
— Dhaval Kulkarni (धवल कुलकर्णी) 🇮🇳 (@dhavalkulkarni) April 1, 2023