మద్రాస్ ఐ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు బాగా వినిపిస్తోంది. తమిళనాడు ప్రజలను ఈ మద్రాస్ ఐ(కండ్ల కలక) బెదరగొడుతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతున్నట్లు చెబుతున్నారు. మొదట రోజుకు 10 కేసులు వస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 100కి చేరినట్లు చెబుతున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా విజృభిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ మద్రాస్ ఐ అనేది తమిళనాడులోని సేలం, మధురై, ధర్మపురి వంటి జిల్లాల్లో ఎక్కవగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుకి 4,500 కేసులు రిపోర్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఆస్పత్రులే కాదు.. అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ.. ఈ చలికాలంలో ఇప్పటివరకు 1.5 లక్షల మద్రాస్ ఐ కేసులు నమోదు అయ్యాయి అని తెలిపారు. అయితే వారిలో ఎవరికీ దృష్టిలోపం జరగలేదన్నారు. కాకపోతే క్లస్టర్ల మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వారికి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. కేసుల ఉద్ధృతి బాగా ఉన్నట్లు అధికారులు కూడా చెబుతున్నారు. ఉదాహరణకు ఎగ్మోర్ లోని రీజనల్ ఆప్తమాలజీ ఇన్ స్టిట్యూట్ కి నవంబర్ మొదటివారంలో 10 ఓపీ కేసులు వస్తే.. ఇప్పుడు రోజులో మద్రాస్ ఐకి చెందిన 100 కేసులు వస్తున్నట్లు తెలిపారు. ఈ మద్రాస్ ఐ వ్యాధి లక్షణాలు ఏమనగా.. కళ్లు ఎర్రగా అవ్వడం, కళ్లు గుచ్చుకుంటున్నట్లు ఉండటం, పుసులు కారడం, దురద రావడం వంటివి జరుగుతూ ఉంటాయి.
இன்று சென்னை எழும்பூர் கண் மருத்துவமனையில் “MADRAS EYE” நோய்க்கான ஆய்வு மேற்கொள்ளப்பட்டது. #Masubramanian #TNHealthminister #MadrasEye #EyeInfection #inspection pic.twitter.com/Bj2WELcKZI
— Subramanian.Ma (@Subramanian_ma) November 21, 2022
కళ్లు నీరు కారే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే సేకరించిన కొన్ని నమూనాలను పరీక్షించిన తర్వాత.. ఇది ఎంటరోవైరస్, అడినోవైరెస్ ల కారణంగా వ్యాపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వైరస్‌ల వల్ల సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కులు కారడం, గొంతు నొప్పి, డయేరియా, పింక్ ఐ, ఒళ్లు నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి. ఈ మద్రాస్ ఐ అనేది వ్యాపించకుండా ఉండాలి అంటే భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే ఇంట్లో ఎవరికైనా ఈ మద్రాస్ ఐ సోకితే.. ఆ కుటుంబాన్ని నాలుగురోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతున్నారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ కూడా ఈ మద్రాస్ ఐని నివారించాలి అంటే.. భౌతిక దూరాన్ని పాటించడమే ప్రధానమైన మంత్రమని చెబుతున్నారు.
Watch | ‘மெட்ராஸ் ஐ’ பாதித்தவர்கள் என்னென்ன செய்யக் கூடாது… என்னென்ன செய்ய வேண்டும்? – அமைச்சர் மா.சுப்பிரமணியன் விளக்கம்!#SunNews | #MadrasEye | @Subramanian_ma pic.twitter.com/tIYnjjs8y0
— Sun News (@sunnewstamil) November 21, 2022