ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే భయపడుతున్నారు.
సాధారణంగా రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా కూడా సెక్యూరీటి లేనిదే అడుగు బయటపెట్టరు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు భద్రత ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. అయితే ఎంతో పటిష్టమైన భద్రత ఉన్నప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో సదరు ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. అయితే తాజాగా మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిపైనే కాల్పులకు తెగపడ్డాడు ఓ ఎఎస్సై. […]
సాధారణంగా రాజకీయాల్లో నాయకులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా గానీ సెక్యూరీటి లేనిదే అడుగు బయటపెట్టరు. పటిష్టమైన సెక్యూరీటి ఉన్నప్పటికి కూడా సదరు రాజకీయ నాయకులపై దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలు మనం గతంలో చాలానే చూశాం. తాజాగా సాక్షాత్తు ఆరోగ్యశాఖ మంత్రిపైనే కాల్పులకు తెగపడ్డాడు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్. ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబాకిషోర్ దాస్ పై ఆదివారం కాల్పులు జరిపాడు. దాంతో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన […]
మద్రాస్ ఐ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు బాగా వినిపిస్తోంది. తమిళనాడు ప్రజలను ఈ మద్రాస్ ఐ(కండ్ల కలక) బెదరగొడుతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతున్నట్లు చెబుతున్నారు. మొదట రోజుకు 10 కేసులు వస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 100కి చేరినట్లు చెబుతున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా విజృభిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ మద్రాస్ ఐ అనేది తమిళనాడులోని సేలం, మధురై, ధర్మపురి వంటి జిల్లాల్లో ఎక్కవగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో […]
కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతో మందిని ఇబ్బందుల పాలు చేయవచ్చు. అంతేకాకుండా ఆ నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాలు చివరకు వారి మెడకే చుట్టుకోవచ్చు. అలా ఓ ఆరోగ్య శాఖా మంత్రి తీసుకున్న నిర్ణయంతో ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన వల్ల చివరకు ఆరోగ్య శాఖా మంత్రి రాజీనామా చేసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. పోర్చుగల్ లోని లిస్బన్ లోని ప్రధాన ఆస్పత్రిలో ప్రసూతి సేవలు లేవు. దాంతో […]
గడిచిన గత పది రోజులుగా దేశంలో ఎక్కడ చూసినా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు వాగులు పొంగి, వంతెనలు దెబ్బతిని రాకపోకలు లేకుండా పోయాయి. చాలా గ్రామాలు జల దిగ్భందంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఏఎన్‌ఎం మాత్రం తన విధులు నిర్వర్తించేందుకు ఓ సాహసమే చేసింది. ఆమె చేసిన పనికి సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాలోని దౌలతాబాద్ పీహెచ్‌సీ పరిధి కుదురుముల్ల […]