అమ్మ అంటే అనురాగం.. కమ్మదనం.. ఒక దైర్యం. అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే ప్రపంచంలో అమ్మను మించిన యోధుడు లేడు అని అంటారు. నవమాసాలు మోసీ కనీ పెంచే తల్లి తన పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేదు. అందుకే ఆ దేవుడు తనకు బదులుగా భూమిపై అమ్మను సృష్టించాడని అంటారు. సాధారణంగా పోలీసులు అంటే ఎంతో కఠినంగా ఉంటారని అందరూ భావిస్తుంటారు.. కానీ వారిలో కూడా ప్రేమను పంచే మాతృమూర్తులు ఉంటారని.. కేరళాకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి నిరూపించింది. ఆమె చేసిన పనికి పోలీస్ ఉన్నతాధికారులే కాదు.. నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
కేరళాకు చెందిన ఎం.ఆర్. రమ్య మొదట టీచర్ కావాలనే ఉద్దేశ్యంతో పీజీ చేసి ఆ తర్వాత బీఈడీ పూర్తి చేశారు. కానీ ఆమెకు మాత్రం పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం లభించింది. భార్యాభర్తల మద్య గొడవ రావడంతో భర్త పన్నెండు రోజుల పసికందును తీసుకొని పారిపోయాడు. దీంతో ఆ మహిళ గత నెల 29 న చేవాయుర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారణ మొదలు పెట్టిన రమ్య బృందం ఆ మహిళ భర్తను పట్టుకున్నారు. కానీ అప్పటికే ఆ పన్నెండు రోజుల పసిబిడ్డ పూర్తిగా నీరసించి ఉండటం చూసి డాక్టర్లు పరీంక్షించి పాప షుగర్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయాయని చెప్పారు. ఆ సమయంలో రమ్యకు తన పిల్లలు గుర్తుకు వచ్చారు.. వెంటనే పసిబిడ్డను దగ్గరికి తీసుకొని లాలించి పాలు ఇచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడింది.
ఒక పోలీస్ అధికారిగానే కాకుండా మాతృమూర్తిగా ఆమె చేసిన పనికి భర్త సైతం ఎంతో సంతోషం, హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు రమ్య పోలీస్ ప్రతిష్టను ఎంతగానో పెంచిందని అభినందిస్తూ.. కేరళా హైకోర్ట్ జస్టిస్ట్ దేవన్ రామచంద్రన్ ఒక లేఖలో పేర్కొన్నారు. అలాగే డీజీపీ రమ్య కుటుంబాన్ని ప్రత్యేకంగా హెడ్ క్వాటర్స్ కి ఆహ్వానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఒక ఉపాధ్యాయురాలిగా కావాల్సిన రమ్య పోలీస్ అధికారి అయి మాతృమూర్తిగా తనలోని గొప్పతనాన్ని చాటుకున్నారని, తల్లి అంటే ఎవరికైనా తల్లే అని ఆమె నిరూపించిందని దేశ వ్యాప్తంగా ఆమెను ప్రశంసిస్తున్నారు.
സിവിൽ പോലീസ് ഓഫീസർ രമ്യയെ സംസ്ഥാന പോലീസ് മേധാവി ആദരിച്ചു pic.twitter.com/mFjuuKJxjt
— Kerala Police (@TheKeralaPolice) October 31, 2022