గుడి, బడి, సిగ్నల్స్, హోటళ్ల ముందు నిత్యం ఎందరో భిక్షగాళ్లు కనిపిస్తారు. చూడగానే.. పాపం వీళ్లకి సరైన తిండి, బట్టలు కూడా లేవు అని జాలి పడి.. తోచినంత దానం చేస్తాం. చిల్లరే కదా దానం చేసేది అనే ఆలోచిస్తాం. కానీ ఆ చిల్లర అడుక్కునే వారిలో మనకన్నా కోటీశ్వరులు ఉన్నారు.. వారి నెల సంపాదన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కన్నా ఎక్కువే ఉంటుందని తెలిస్తే.. ఆశ్చర్యంతో పాటు కొందరికి ఒకింత అసూయ కూడా కలుగుతుంది. ఈ కోవకు చెందిన వ్యక్తే భరత్ జైన్. భారతదేశ బిచ్చగాళ్లలో కోటీశ్వరుడు. అతడి నెల సంపాదన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికన్నా ఎక్కువే. కోట్లకు అధిపతి అయినా.. యాచకవృత్తిని మాత్రం వదలడం లేదు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : డిజిటల్ పేమెంట్ ద్వార బిచ్చం వేయాలంటున్న బెగ్గర్
భరత్ జైన్.. భారతదేశంలోకెళ్లా.. ధనవంతుడైన బిచ్చగాడు. ముంబైలో నివాసం ఉండే ఇతడు.. ధనవంతులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లోనే భిక్షాటన చేస్తాడు. ముఖ్యంగా ముంబై ఛత్రపతి శివాజీ టర్మినల్, ఆజాద్ మైదాన్ ప్రాంతంలో ఎక్కువగా తారసపడతాడు. భిక్షాటన చేసుకునే భరత్ జైన్ నెల సంపాదన 75 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఇతడికి ముంబైలో రెండు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఒక్కోదాని విలువ అక్షరాల 70 లక్షల రూపాయలు. అంటే రెండింటి విలువ 1.40 కోట్లు.
ఇది కూడా చదవండి : నెలకు రూ. 40 వేలు సంపాదిస్తున్న బిచ్చగత్తె..
భరత్ జైన్ తన వృత్తి గురించి ఏమాత్రం సిగ్గుపడడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తల్లిదండ్రులు, భార్యను ఏ పని చేయనివ్వడు. భరత్ జైన్ ఆస్తిపాస్తులు, నెల సంపాదన గురించి తెలిసిన వారు.. ఇతడి పనే బాగుంది కదా అని భావిస్తున్నారట. ఇక స్కూప్‌వూప్ అనే వెబ్‌సైట్ ప్రకారం భారత దేశంలో బెగ్గింగ్ ఇండస్ట్రీ ఆదాయం 1.5 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 10 వేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువగానే ఉంది. భిక్షాటన చేసుకునే కోటీశ్వరుడు భరత్ జైన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.