ఒక మహిళ తన కుటుంబంలో అధిక ప్రాధాన్యత నిచ్చేది తన కడుపున పుట్టిన బిడ్డలకే. పుట్టిన పిల్లలు, ఎదిగి ప్రయోజకులైతే మొదట ఆనందించేది తల్లే. తిండి తిప్పలు మానేసి అహర్నిశలు వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. అదే బిడ్డ అయురార్థంతో కన్నుమూస్తే తల్లి పేగు తల్లడిల్లిపోతుంది. కళ్ల ముందు తనువు చాలిస్తే ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం. ఇటువంటి విషాదం పగవాటి కూడా రాకూడదని అనుకుంటాం. కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నఆ తల్లి కూడా అదే వేదన చెందింది. […]
జీవితంలో చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయి.. ఆత్మహత్య వంటి దారుణాలకు పాల్పడుతున్న వారి గురించి నిత్యం అనేక వార్తలు చదువుతున్నాం. మరీ దారుణం ఏంటంటే.. సోషల్ మీడియా పోస్టులకు లైక్‌లు రావడం లేదనే కారణంగా ఆత్మహత్య చేసుకున్నవారు కూడా మన సమాజంలో ఉన్నారు. అలాంటి ఘటనల గురించి చదవినప్పుడు.. విన్నప్పుడు.. అరే మరీ ఇంత చిన్న విషయాలకే.. ప్రాణాలు తీసుకోవాలా.. అసలు వీరికి జీవితం విలువ తెలుసా అనిపిస్తుంది. కష్టాలు, బాధలు, అవమానాలు వచ్చినప్పుడు కుంగిపోతే ఎలా.. […]
బిచ్చగాళ్ల దగ్గర భారీగా నగదు ఉంటుందని.. వారికి లక్షల్లో విలువైన ఆస్తులు ఉంటాయని ఇప్పటికే అనేక వార్తలు చదివాం. ఇక కొందరు బిచ్చగాళ్లు.. ఆలయాలకు భారీగా నగదు విరాళంగా ఇచ్చిన సంఘటనలు కూడా చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు భిన్నం. ఆ వ్యక్తికి సుమారు ఐదు కోట్ల విలువైన అంతస్తు ఉంది. దాని ద్వారా నెలకు 1.27 లక్షల రూపాయల ఆదాయం అద్దెల రూపంలో లభిస్తుంది. అయినా సరే ఆ డబ్బులు ఖర్చులకు […]
నిలువెత్తు త్యాగానికి.. అనంతమైన ప్రేమకు.. అంతులేని జాలికి నిలువెత్తు నిదర్శనం తల్లి. బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం తన జీవితాన్ని ధారపోస్తుంది. తన ఆశలు, చిన్న చిన్న కోరికలు చంపుకుని.. పిల్లలను ప్రేమగా చూసుకుంటుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా.. అయిన వారు దూరమైన సరే.. బిడ్డలనే ధైర్యంగా మార్చుకుని.. కష్టాల కడలిని ఎదురీదుతుంది. బిడ్డల చిరునవ్వు చూసి అప్పటి వరకు తాను అనుభవించిన కష్టాలను మర్చిపోతుంది. వారి సంతోషం కోసమే తాను బతుకుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. […]
Mahabubabad Old Man Begging In Own Village Over Son Rejecting For Maintenance: సాధారణంగా తల్లిదండ్రులు అంటే.. బిడ్డల బాగోగుల కోసం నిత్యం శ్రమిస్తారు. తాము పస్తులుండి మరి పిల్లల కడుపు నింపుతారు. వారికి చిన్న ఆపద వస్తే.. విలవిల్లాడతారు. బిడ్డలకు మంచి జీవితం ఇవ్వడం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు. ఇంత చేసి బిడ్డలను జీవితంలో స్థిరపడేలా చేసిన తల్లిదండ్రులకు చివరకు కనీసం పట్టెడన్నం పెట్టడానికి కూడ వెనకాడతారు కొందరు. తల్లిదండ్రులు […]
మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలే అని ఓ కవి అన్నాడు. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో… ప్రతి దాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తున్నాడు మనిషి. నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నాడు. ఆఖరికి కళ్లెదురుగా సాటి మనిషి మృతి చెందినా.. మనసు కరగడం లేదు. ఆఖరికి మృతదేహాన్ని అప్పగించే దగ్గర కూడా లంచం డిమాండ్ చేసి అమానవీయంగా వ్యవహరిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఏపీ రిమ్స్ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్లు ఎంత అమానవీయంగా ప్రవర్తించారో చూశాం. చివరకు చేసేదేం […]
గుడి, బడి, సిగ్నల్స్, హోటళ్ల ముందు నిత్యం ఎందరో భిక్షగాళ్లు కనిపిస్తారు. చూడగానే.. పాపం వీళ్లకి సరైన తిండి, బట్టలు కూడా లేవు అని జాలి పడి.. తోచినంత దానం చేస్తాం. చిల్లరే కదా దానం చేసేది అనే ఆలోచిస్తాం. కానీ ఆ చిల్లర అడుక్కునే వారిలో మనకన్నా కోటీశ్వరులు ఉన్నారు.. వారి నెల సంపాదన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కన్నా ఎక్కువే ఉంటుందని తెలిస్తే.. ఆశ్చర్యంతో పాటు కొందరికి ఒకింత అసూయ కూడా కలుగుతుంది. ఈ కోవకు […]
ప్రభుత్వ ఉద్యోగి అంటే ఆ దర్పమే వేరు. ఆదివారాలు సెలవు రోజుల్లో వర్క్ టెన్షన్ అంతా పక్కన పెట్టి కుటుంబంతో సరదాగా గడుపుతారు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రం అడుక్కునేందుకు తనకు సెలవు కావాలని పై అధికారులను కోరి అందరిని ఆశ్చర్య పరిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ యాదవ్ డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ‘ఆదివారం నేను భిక్షాటనకు వెళ్లాలి.. దయచేసి నాకు సెలవు మంజూరు చేయమంటూ’ తన పైఅధికారులను అభ్యర్ధించాడు. దీంతో పైఅధికారులు షాక్ […]