అంతర్జాతీయ సాహిత్య వేదికపై భారతదేశం పేరు మరోసారి వెల్లివిరిసింది. ప్రముఖ భారత రచయిత్రి గీతాంజలి శ్రీ.. 2022 బుకర్ ప్రైజ్ అందుకొని సంచలనం సృష్టించారు. ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీ(గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. 2018లో ఆమె రాసిన రేత్ సమాధి(ఇంగ్లీష్ లో టాంబ్ ఆఫ్ సాండ్)కి గానూ 2022 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ దక్కింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుపొందిన మొదటి ఇండియన్ లాంగ్వేజ్ బుక్ గా ‘టాంబ్ ఆఫ్ సాండ్’ నిలిచింది. అదీగాక హిందీ నుండి అనువదించిన మొదటి నవలగా నిలవడం విశేషం.
ఇక బుకర్‌ప్రైజ్ గౌరవం అందుకున్న తొలి భారత రచయిత్రిగా గీతాంజలి శ్రీ చరిత్రలోకెక్కారు. గురువారం లండన్ లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో.. గీతాంజలి శ్రీకి ప్రైజ్ ప్రదానం చేశారు. ఆమెతో పాటు ‘రేత్ సమాధి’ని ఇంగ్లీష్ లోకి అనువదించిన రచయిత్రి డైసీ రాక్‌వెల్(అమెరికా)కు కూడా ఈ గౌరవం దక్కింది. వీరికి యాభై వేల బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్లను క్యాష్ ప్రైజ్ గా అందించారు.
అవార్డు గెలిచిన ‘రేత్ సమాధి’ నవల విషయానికి వస్తే.. ఉత్తర భారతంలో ఎనభై ఏళ్ల వృద్ధురాలి కథ. వృద్ధురాలు తన భర్త మరణంతో తీవ్ర డిప్రెషన్ లోకి వెళుతుంది. ఆ తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ.. “బుకర్ ప్రైజ్ వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇది ఒక గొప్ప గౌరవం. అద్భుతంగా ఉంది. గర్వంగా ఉంది” అని ఆమె మాట్లాడారు.
ఇప్పటివరకు గీతాంజలి శ్రీ 5 నవలలు రాసినట్లు తెలుస్తుంది. 2000లో ఆమె రాసిన ‘మయి’ నవల ‘క్రాస్ వర్డ్ బుక్ అవార్డు-2001’కి నామినేట్ అయినట్లు సమాచారం. గీతాంజలి ఇండియన్ పాపులర్ రైటర్ ప్రేమ్ చంద్ పై విమర్శనాత్మక రచన కూడా చేశారు. ఆమె చిన్నతనంలో పుస్తకాలు ఆంగ్లంలో లేకపోవడంతో తాను హిందీపై మక్కువ పెంచుకున్నట్లు ఆమె తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనల ఆధారంగా రాసిన ‘హమారా షహర్ ఉస్ బరాస్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Take a look at the moment Geetanjali Shree and @shreedaisy found out that they had won the #2022InternationalBooker Prize! Find out more about ‘Tomb of Sand’ here: https://t.co/VBBrTmfNIH@TiltedAxisPress #TranslatedFiction pic.twitter.com/YGJDgMLD6G
— The Booker Prizes (@TheBookerPrizes) May 26, 2022
ఇదిలా ఉండగా.. రేత్ సమాధి నవలను ఇంగ్లీష్ లోకి అనువదించిన అమెరికన్ రచయిత్రి డైసీ రాక్‌వెల్.. ట్రాన్స్‌లేటర్ గానే కాకుండా పెయింటర్ గా కూడా డైసీ పాపులర్. ఉర్దూ, హిందీ నవలలను, రచలను ఎన్నింటినో ఆమె ఆంగ్లంలోకి అనువదించినట్లు తెలుస్తుంది. ఇక 2018లో ప్రచురితమైన రేత్ సమాధి నవలను.. టిల్టెడ్ యాక్సిస్ ప్రెస్ ద్వారా 2021 ఆగస్టులో ఇంగ్లీష్ లో పబ్లిష్ చేశారు. మొత్తం 135 పుస్తకాలు పోటీపడగా.. ‘టాంబ్ ఆఫ్ సాండ్’ బుకర్ ప్రైజ్ గౌరవం దక్కడం విశేషం. మరి బుకర్ ప్రైజ్ అందుకున్న మొదటి ఇండియన్ రచయిత్రి గీతాంజలి శ్రీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
The moment of joy. Huge congratulations to Geetanjali Shree, translator @shreedaisy and @TiltedAxisPress on winning the #2022InternationalBooker Prize for Tomb of Sand @TheBookerPrizes pic.twitter.com/tduTnTzBMo
— Ted Hodgkinson (@TeditorTed) May 26, 2022