ట్విట్టర్ ఉంది కదా అని అకౌంట్ ఓపెన్ చేసి ఏ ట్వీట్లు పడితే.. ఆ ట్వీట్లు చేస్తున్నవారే లక్ష్యంగా కేంద్రం ఆంక్షలకు దిగుతోంది. చేసే ట్వీట్ కచ్చితంగా కేంద్ర సర్కారుకు నచ్చాలట. లేదంటే ఖాతానే బ్లాక్ అవుతుందట. ఈ విషయాలు ఎవరో చెప్పట్లేదు.. ట్విట్టరే స్వయంగా చెప్పిన వాస్తవమిది. ప్రపంచంలోనే అత్యధిక లీగల్ డిమాండ్లు మన దేశం నుంచే వస్తున్నాయట. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.
ట్విట్టర్ లో జర్నలిస్టుల పోస్టుల తొలగింపు అభ్యర్ధనల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని సామాజిక మాధ్యమ నివేదిక పేర్కొంది. 2021 జూలై-డిసెంబర్ మధ్య ప్రపంచవ్యాప్తంగా తమకు 326 లీగల్ డిమాండ్లు రాగా, భారత ప్రభుత్వం నుంచే అత్యధికంగా 114 డిమాండ్లు వచ్చాయని ట్విట్టర్ వెల్లడించింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో.. గత ఏడాది జనవరి-జూన్ మధ్య కూడా కేంద్రం 89 లీగల్ డిమాండ్లు పంపినట్టు తెలిపింది. యూజర్ల సమాచారం ఇవ్వాలని కూడా భారత్ ఆదేశిస్తున్నదని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అలాంటివి 11,460 అభ్యర్థనలు రాగా, భారత్ నుంచే 2,211 అభ్యర్థనలు వచ్చాయని వివరించింది. అంతేకాదు.. ఈ ఆరు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ తొలగింపునకు 47,572 వినతులు అందగా, భారత్ నుంచే 3,992 అందాయని పేర్కొన్నది. గత మూడేండ్లలో ఎక్కువ లీగల్ డిమాండ్లు చేస్తున్న దేశాల్లో భారత్‌తో పాటు జపాన్, రష్యా, దక్షిణ కొరియా, టర్కీ ఉన్నాయని తెలిపింది.
The number of requests made by the Indian government to #Twitter to take down content on the micro-blogging platform has risen considerably since 2019, according to data shared by Minister of State of Electronics and Information Technology #RajeevChandr… https://t.co/gs2yrHpRD5
— BOOM Live (@boomlive_in) July 29, 2022
గతేడాది ఓ చిన్నారి వ్యక్తిగత అంశాలకు సంబంధించి ప్రముఖ నేత చేసిన పోస్టును తొలగించాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ నోటీసులు ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేసింది. “కొన్ని ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్ చేయాలంటూ కేంద్ర ఐటీ శాఖ తరచూ ఆర్డర్లు జారీ చేస్తున్నది. రాజకీయ, మీడియా సంబంధిత వెబ్‌సైట్ లింక్‌లను కూడా తొలగించాలని చెప్తున్నది. దీనివల్ల యూజర్ల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే అవుతుందన్నది అందరి వాదన”.
They are scared of Shri. @RahulGandhi ji because he speaks the language of love, truth & peace.
Cheap tactics by the Modi govt of getting his Twitter account temporarily blocked won’t stop this fight for justice. #मैं_भी_Rahul pic.twitter.com/qzxKxTDJZp
— Nitin Agarwal (@nitinagarwalINC) August 8, 2021
ట్విట్టర్ రూల్స్ ఏంటి?
వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు, సమాజంలో వైషమ్యాలు రాకుండా చూసేందుకు ట్విట్టర్ కొన్ని నిబంధనలు రూపొందించింది. అలాగే.. అత్యాచార బాధితులు, వారి సంబంధీకుల ఫొటోలు, ఇతర వివరాల్ని బహిర్గతం చేయడం నిషేధం. వీటిని ఉల్లంఘించి ఎవరైనా ట్వీట్ చేస్తే.. ఆ పోస్టును హైడ్ చేసి, నోటీసులు ఇస్తుంది. ఆ అకౌంట్ హోల్డర్, ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేవరకు ఖాతాను లాక్ చేసి ఉంచుతుంది. ఒకవేళ అకౌంట్ హోల్డర్ తాను నిబంధనలు ఉల్లంఘించలేదని చేసిన అపీల్లో నిజం ఉందని భావించినా.. ట్విట్టర్ ఆ ఖాతాను అన్‌లాక్ చేస్తుంది.
ఇదీ చదవండి: అద్దెకు ఉన్న యువతి దౌర్జన్యం! మెట్ల మీదే వారం రోజులుగా ఇంటి యజమాని కుటుంబం!
ఇదీ చదవండి: పదేళ్ల క్రితం పార్థ ఛటర్జీ చేతిలో రూ.6,300.. ఇప్పుడు కోట్లకు పడగలెత్తిన వైనం!