ట్విట్టర్ ఉంది కదా అని అకౌంట్ ఓపెన్ చేసి ఏ ట్వీట్లు పడితే.. ఆ ట్వీట్లు చేస్తున్నవారే లక్ష్యంగా కేంద్రం ఆంక్షలకు దిగుతోంది. చేసే ట్వీట్ కచ్చితంగా కేంద్ర సర్కారుకు నచ్చాలట. లేదంటే ఖాతానే బ్లాక్ అవుతుందట. ఈ విషయాలు ఎవరో చెప్పట్లేదు.. ట్విట్టరే స్వయంగా చెప్పిన వాస్తవమిది. ప్రపంచంలోనే అత్యధిక లీగల్ డిమాండ్లు మన దేశం నుంచే వస్తున్నాయట. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ట్విట్టర్ లో జర్నలిస్టుల పోస్టుల తొలగింపు అభ్యర్ధనల్లో భారత్ […]
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు ఆఫర్ ప్రకటించి పది రోజులు గడుస్తోంది. ట్విట్టర్ లో వాటాదారుగా చేరిన ఎలాన్ మస్క్ మరికొన్ని గంటల్లో ఆ సంస్థ మొత్తానికే యజమాని కాబోతున్నట్లు సమాచారం. తొలుత ఈ ప్రతిపాదనను ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ట్విటర్ బోర్డు సైతం తాము కంపెనీని విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలిచ్చింది. కానీ, మస్క్ ఊరుకోలేదు. తాను ఈ విషయంలో ఎంత స్పష్టతతో ఉన్నారో తెలియజేసేలా ఎప్పటికప్పుడు సంకేతాలిస్తూ వచ్చారు. చివరకు […]
ప్రముఖ ఫోటో మెసేజింగ్, ఫోటో షేరింగ్ యాప్ స్నాప్‌చాట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా దిగ్గజాలుగా ఉన్న ఫేస్‌బుక్, ట్విట్టర్ బాటలోనే పయణిస్తూ.. అనతి కాలంలోనే ఇండియాలో యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోగలిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తనదైన ముద్ర వేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో స్నాప్‌చాట్ సీఈఓ ఇవాన్ స్పీగెల్.. గతంలో ఇండియాపై చేసిన ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. 2015లో స్నాప్‌చాట్ సిఇవో ఇవాన్ స్పీగెల్ […]
పైకి గంభీరంగా కనిపించినా.. ఉక్రెయిన్‌తో యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలన్ని.. రష్యా నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. యుద్ధం మానుకోవాలని సూచించాయి. అయినప్పటికి.. ఎవరి మాట వినడం లేదు పుతిన్. దీంతో చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతో పాటు ఎంటర్‌టైన్మెంట్ సైట్లు కూడా అక్కడ బంద్ అయ్యాయి. ఇప్పటి వరకు రష్యాపై సుమారు 5వేలకుపైగా ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు పుతిన్ తీసుకున్న నిర్ణయానికి ఫలితంగా.. ఆ దేశ ప్రజలందరూ […]
ఏదైనా వ్యాపారంలో అద్భుతంగా రాణించాలంటే ఆ వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియడంతో పాటు.. బ్రాండ్ ప్రమోషన్ కూడా కీలకం. ఈ పనులు సరిగా చేయనట్లయితే ఆ వ్యాపారం మూతపడ్డట్లే. సరిగ్గా ‘డబ్‌స్మాష్’ యాప్ విషయంలో ఇదే జరిగింది. డబ్‌స్మాష్ యాప్ ఏంటి అని ఆలోచిస్తున్నారా?. ఇది కూడా షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్. టిక్ టాక్ కన్నా ముందు వచ్చింది. జనాలను విపరీతంగా ఆకర్షించింది. యాప్ ని అభివృద్ధి చేసిన వారికి లాభాల పంట పండించింది […]
చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులోనూ చవకగా ఇంటర్నెట్ డేటా.. ఇంకేముంది అందరికి సోషల్ మీడియాలోనే కాలక్షేపం. ఇదే ఇప్పటి కాలం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు జనాలు. అయితే దీని వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగం లేని సమయంలో ఏదైనా ఓ వార్త జనాలకు చేరాలంటే కాస్త సమయం పట్టేది. కానీ ఇప్పుడు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. దీంతో […]
మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇంస్టాగ్రామ్.. తాజాగా యువతరంపై దృష్టిపెడుతూ “టేక్ ఎ బ్రేక్” అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సరికొత్త టూల్ ద్వారా ఫీడ్(స్క్రోలింగ్)లో కాసేపు గడిపిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో మరికొంత సమయం గడిపేందుకు అవకాశం కల్పించనుంది. మొదటగా ఈ ఫీచర్ ని యునైటెడ్ స్టేట్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో అమలుచేసింది. రాబోయే రోజుల్లో అన్ని దేశాలకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ గురించి […]