సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే అతిపెద్ద ఆరోపణ అధికార దుర్వినియోగం. చేతిలో పవర్ ఉందిగా అని హుకుం జారీ చేయడం, కిందిస్థాయి వారిని సొంత పనులకు వాడుకోవడం, పెత్తనం చలాయించడం చేస్తే.. పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని ఓ ఐఏఎస్ జంటకు తెలిసొచ్చింది. తమ పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకెళ్లడానికి ఏకంగా స్టేడియాన్నే ఖాళీ చేయించిన ఓ ఐఏఎస్‌ల జంటపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర జేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత చెరో రాష్ట్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. సంజీవ్ ఖిర్వార్, రింకు దుగ్గా జంట ఐఏఎస్ అధికారులు. వీళ్లిద్దరూ రోజూ ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియానికి తమ పెంపుడు కుక్కను వాకింగ్ కు తీసుకెళ్తారు. వారి కుక్క వాకింగ్ చేసేందుకు అడ్డుగా ఉంటారని స్టేడియంలోని అథ్లెట్లను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని వారిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వారి ఫొటోలు, వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
Senior IAS couple transferred to Ladakh & Arunachal Pradesh. They were in the line of fire after images of walking their dog at the Tyagraj stadium went viral. Athletes complained they were forced to stop trg. Sanjiv Khirwar transferred to Ladakh & his wife to Arunachal Pradesh. pic.twitter.com/604Xqa4D1h
— GAURAV C SAWANT (@gauravcsawant) May 26, 2022
వెంటనే వారిపై వస్తున్న ఆరోపణలపై వెంటనే నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నిర్ధారణకు వచ్చిన కేంద్రం వారిపై బదిలీ వేటు వేసింది. అదికూడా ఇద్దరినీ వేర్వేరు రాష్ట్రాలకు బదిలీ చేసింది. భర్త సంజీవ్ ఖిర్వార్ ను లద్దాఖ్ కు, భార్య రింకు దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్ కు బదిలీ చేస్తూ.. తక్షణమే ఉత్తర్వులు అమలులోకి వస్తాయంటూ ఆదేశించింది.
నిజానికి ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నా కూడా.. అది కేంద్రపాలిత ప్రాంతం కావడంతో అక్కడ ఐఏఎస్ అధికారుల నియామకం, బదిలీ వంటి వాటిపై నేరుగా కేంద్రమే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ వ్యవహారంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఢిల్లీలోని అన్ని క్రీడా మైదానాలు, స్టేడియాలు రాత్రి 10 గంటల వరకూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. అథ్లెట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చని సూచించారు. ఐఏఎస్ అధికారులు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Instant justice. Dog walking IAS Couple Sanjeev Khirwar and Rinku Dugga shunted out to Ladakh and Arunachal Pradesh from Delhi. Stadium is for our hard-working young sportspersons who represent the state and the country. Not for bureaucrats who consider themselves next to God. pic.twitter.com/iPIdVJ5Sde
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 26, 2022