పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అందుకే వివాహ వేడుకను జీవితాంతం మర్చిపోని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. పెళ్లిలో జరిగే ప్రతి వేడుకను చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. పెళ్లి కార్డులు మొదలు, బట్టలు, నగలు, ఊరేగింపు, విందు భోజనం ఇలా ప్రతి దాన్ని ప్రత్యేకంగా మలుచుకోవాలని భావిస్తారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. అయితే ఎంతో సంతోషంగా, సంబరంగా సాగుతున్న వివాహ వేడుకల్లో అప్పుడప్పుడు అనుకోని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని.. తీరని విషాదాన్ని నింపుతాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి గుజరాత్‌లో చోటు చేసుకుంది. తన పెళ్లి వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు కుప్పకూలాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఆటపాటలతో సందడి చేస్తూనే గుండెపోటుతో మరణించాడు. పెళ్లికి కొద్ది గంటల ముందే ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: ఏళ్లుగా ముగ్గురితో సహజీవనం.. కట్ చేస్తే ఇప్పుడు ఒకే వేదిక మీద పెళ్లి!
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సూరత్ జిల్లా మాండ్వి మండలం అరేత్ గ్రామానికి మితేష్ భాయ్ చౌదరి (33)కి శనివారం వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం హల్దీ వేడుక ముగిసింది. వివాహానికి ముందు జరగాల్సిన అన్ని కార్యక్రమాలు ముగిశాయి. వధువుది బలోద్ తాలుకలోని ధమండలా గ్రామం. వివాహ వేడుక అక్కడే జరగాల్సి ఉంది. వరుడు తన ఇంటి నుంచి వధువు ఇంటికి వెళ్లాలి. ఇందుకు గాను డీజే పాటలతో ఊరేగింపు ఏర్పాటు చేశారు. మితేష్, తన స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసుకుంటూ.. ఊరేగింపులో పాల్గొన్నాడు. డ్యాన్స్ చేస్తూ.. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా కనిపించిన మితేష్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండె పోటుతో చూస్తుండగానే కిందపడిపోయాడు.
ఇది కూడా చదవండి: Marriage Viral Video: పెళ్లి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు! వీడియో వైరల్!
వెంటనే మితేష్ కుటుంబ సభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. తమ వల్ల కాదని చెప్పడంతో.. బార్డోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు. మరి కొన్ని గంటల్లో వివాహం చేసుకుని.. నూతన జీవితంలోకి అడుగుపెట్టాల్సిన వాడు ఇలా ఉన్నట్టుండి కన్నుమూయడంతో అతడి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో ముగినిపోయారు. ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రేమలో పడిన కిర్రాక్ RP.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు!