సాధారణంగా పెంపుడు కుక్కలను యజమానులు ఎంతో అపురూపంగా పెంచుకుంటారు. పెట్స్ ని తమ కుటుంబంలో ఒక సభ్యులుగా చూసుకుంటారు. ఈ మద్య పెంపుడు కుక్కలకు పుట్టిన రోజు, వివాహాలు, సీమంతాలు ఎంతో ఘనంగా జరుపుతున్నారు. వీటికి సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మద్య హర్యాణాలోని గురు గ్రామ్ లో హిందూ సంప్రదాయ పద్దతిలో తమ పెంపుడు కుక్కలకు వివాహం జరిపించారు. అలాంటి ఘటనే ఒకటి ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఉత్తర్ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలో పెంపుడు శునకాలకు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. రెండు పెంపుడు శునకాలకు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అంతేకాదు శునకాల పెళ్లికి వందల మంది అతిధులు కూడా విచ్చేసి ఆశీర్వదించారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున టామీ, జెల్లీ అనే శునకాలకు వివాహం జరిపించారు వాటి యజమానులు. పెళ్లి కూతురు జెల్లీ, వరుడు టామీకి పూల మాలలు వేసి చక్కగా తయారు చేసుకొని డబ్బుల మోతతో ఊరేగింపుగా పెళ్ల మండపానికి తీసుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఇరు కుటుంబ సభ్యులు ఆనందోత్సాహలతో డ్యాన్స్ చేసుకుంటూ తెగ హల్ చల్ చేశారు. కల్యాణ మండపం వద్దకు జెల్లీ, టామీని తీసుకు వచ్చి పెళ్లి పీటలు ఎక్కించారు. వధూ వరులుగా మారిన శునకాలకు పండితుల సమక్షంలో భాజా భజంత్రీలతో హిందూ సంప్రదాయ పద్దతిలో శునకాల వివాహం జరిపించారు. చక్కటి వంటకాలతో అతిధులకు విందుభోజనాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.
#WATCH | A male dog, Tommy and a female dog, Jaily were married off to each other in UP’s Aligarh yesterday; attendees danced to the beats of dhol pic.twitter.com/9NXFkzrgpY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2023