గత కొంత కాలంగా భారత్ లో పలు చోట్ల భూకంపాలు సంబవిస్తున్నాయి. భూకంపాల ధాటికి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల అఫ్గానిస్తాన్ లో సంబవించిన భారీ భూపకం వల్ల వందల మంది చనిపోయారు.. వెల మంది గాయపడ్డారు. ఇండోనేషియాలో వరుస భూకంపాలతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు అక్కడి ప్రజలు. భారత్ లో భూకంపాలు వస్తున్నప్పటికీ పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు పెద్దగా లేవు. తాజాగా మణిపూర్ లో పలు చోట్ల స్వల్ప భూకంపం సంబవించింది. శుక్రవారం ఉదయం మణిపూర్ లోని మోయిరాంగ్ పట్టణ ప్రాంతంలో భూమి కంపించడం జరిగిందని అధికారులు తెలిపారు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5 గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజి వారు తెలిపారు. భూమిలో దాదాపు 110 కిలోమీర్ల లోతులో కదలికలు రావడం వల్లనే ఈ భూకంపం వచ్చిందని అధికారులు అంటున్నారు. కాగా, మోయిరంగ్ కి వంద కిలోమీటర్ల దూరంలో భూ కంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. భూకంపం సంబవించినపుడు భవనాలు కదలడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు అన్నారు.
An earthquake of magnitude 4.5 occurred 100km SE of Moirang, Manipur at around 10:02am. The depth of the earthquake was 110 km below the ground: National Center for Seismology pic.twitter.com/UBykj2zEn7
— ANI (@ANI) September 23, 2022
ఇది చదవండి: వైరల్ వీడియో: ATM సెంటర్‌ను కబ్జా చేసిన ఆవు.. బందుల దొడ్డిగా మార్చేసింది!