Viral Video: దేశంలో ఏటీఎమ్ సెంటర్ల సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తం కాకపోయినా.. చాలా చోట్ల ఏదో ఒక సమస్యతో వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల ఏటీఎమ్ సెంటర్లు కాస్తా జంతువుల స్థావరాలుగా మారిపోయిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. తాజాగా, ఓ ఏటీఎమ్ సెంటర్ బందుల దొడ్డిగా మారింది. ఓ ఆవు అందులో సేదతీరి రచ్చ రచ్చ చేసిపెట్టింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్, రేవాలోని నైఘరిలో ఓ ఏటీఎమ్ సెంటర్ ఉంది. కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి అందులో డబ్బులు డ్రా చేసుకోవటానికి వెళ్లాడు.
ఏటీఎమ్ లోపలికి అడుగుపెట్టగానే అవాక్ అయ్యాడు. అక్కడ ఓ ఆవు సేదతీరుతోంది. సేద తీరటం మాత్రమే కాదు. ఆ ఏటీఎమ్ సెంటర్‌ను బందుల దొడ్డిగా మార్చేసింది. అక్కడంతా పేడను విసర్జించింది. దీంతో ఏటీఎమ్ ఫ్లోర్ మొత్తం దాని పేడతో నిండిపోయింది. సదరు వినియోగదారుడు లోపల ఉండి డబ్బులు తీసుకోవటానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు. కంపు భరించలేక ముక్కు మూసుకుని డబ్బులు డ్రా చేసుకున్నాడు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఏటీఎమ్‌లో డబ్బులు డ్రా చేసుకుంటున్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో సదరు వినియోగదారుడి ముఖ కవలికలు ప్రత్యేకంగా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఆ ఆవు ఏసీ కోసమే అందులో ఉంటోంది’’.. ‘‘ అక్కడ ఆవు ఉందని మీరు చూస్తున్నారు. కానీ, ఆ ఏటీఎమ్ దగ్గర ఉండాల్సిన సెక్యూరిటీ గార్డ్ ఎక్కడ?’’.. ‘‘ ఇండియాలో ఇలాంటివి మామూలే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఏటీఎమ్ సెంటర్‌ను బందుల దొడ్డిగా మార్చిన ఆవుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
एटीएम में गाय ने गोबर किया, नाक बंद किए चाचा का रिएक्शन वायरल
मध्यप्रदेश के रीवा के नईगढ़ी का ये वीडियो वायरल हो रहा है जहां ATM बूथ को गाय ने घर बना रखा है। और एक व्यक्ति नाक दबाए पैसे निकालने पहुंचा है।
ये वीडियो व्यक्ति के भतीजे ने रिकार्ड किया है। pic.twitter.com/084ecYsye2
— Shubhankar Mishra (@shubhankrmishra) September 22, 2022
ఇవి కూడా చదవండి : వీడియో: చనిపోయిన యజమానిపై ప్రేమతో శ్మశానానికి పరిగెత్తిన ఆవు!