ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి. శీతలగాలులు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో చలి పెరిగి, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలోకి పడిపోయాయి. ఈ కారణంగా చాలా మంది ఇప్పటికే మరణించారు. అదీకాక పొగమంచు కారణంగా ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. వీటితో పాటుగా కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులు డిజిల్, పెట్రోల్ వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
దేశంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంత కింది స్థాయికి సరాసరి కనిష్ట ఉష్ణోగ్రతలు జారిపోతున్నాయి. దానికి తోడు పొగమంచు కూడా తోడవ్వడంతో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఎయిర్ క్వాలిటీ సూచీ దారుణంగా పడిపోయింది. కనీసం ఊపిరి తీసుకునే పరిస్థితి కూడా లేదు ఢిల్లీలో. దాంతో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. BS3 పెట్రోల్, BS4 డిజిల్ ఫోర్ విలర్ వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. మంగళవారం నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ నిషేధాన్ని 12 వరకు అమల్లో ఉంచుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లోన్ని పంట పొలాల్లో ఉన్న వ్యర్థాలను కాల్చకుండా చర్యలు తీసుకుంది.
ఈ క్రమంలోనే దేశంలో వాయు కాలుష్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (CAQM) కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. అందులో భాగంగానే ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డిజిల్ ఫోర్ విలర్ వాహనాలపై తాత్కాలిక నిషేధం విస్తూ.. ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో సరాసరి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయాయి. గత 9 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాజాగా ఢిల్లీలో సరాసరి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలుగా నమోదు అయ్యాయి. దాంతోనే ఈ నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్ సర్కార్.
The #Delhi government has imposed a temporary ban on plying of BS3 or older petrol vehicles and BS4 or older diesel vehicles in Delhi-NCR. Details: https://t.co/H7KhuFGCVK
— carandbike (@carandbike) December 6, 2022