200 కోట్ల రూపాయల హవాలా కేసులో నిందితుడిగా.. తీహార్ జైలులో ఉన్న సుఖేష్.. వరుస లేఖలు విడుదల చేస్తూ.. సంచలనం సృష్టిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ప్రేమ లేఖ రాయగా.. తాజాగా మరో లెటర్‌లో బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆ వివరాలు..
200 కోట్ల రూపాయల హవాలా కేసులో.. ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్.. తాజాగా మరో బాంబు పేల్చాడు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో.. అప్రదిష్టపాలైన బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుఖేష్.. బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తూ.. ఓ లేఖ విడుదల చేశాడు. దీనిలో తాను బీఆర్‌ఎస్ పార్టీకి ఏకంగా 75 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పడంతోనే తాను.. బీఆర్‌ఎస్‌కు 75 కోట్ల రూపాయలు ఇచ్చానంటూ లేఖలో వెల్లడించడంతో.. ఇది సంచలనంగా మారింది. హవాలా కేసులో.. నిందితుడిగా ఉండి.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుఖేష్.. బీఆర్‌ఎస్ పార్టీపై ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సుఖేష్ లేఖ.. తెలంగాణలో పెను ప్రకంపనులు సృష్టిస్తోంది. ఆ వివరాలు..
సుఖేష్ విడుదల చేసిన లేఖలో సంచలన విషయాలు వెల్లడించాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరఫున 2020 సంవత్సరంలోనే హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చినట్టు లేఖలో చెప్పుకొచ్చాడు సుఖేష్. ఈ ఆపరేషన్‌కు తాము 15 కిలోల నెయ్యి అనే కోడ్ వర్డ్ పెట్టుకున్నట్టు పేర్కొన్నాడు. మరోవైపు.. ఈ విషయంలో కేజ్రీవాల్‌తో తాను జరిపిన 700 పేజీల వాట్సప్ చాట్ తన దగ్గర ఉందని.. సమయం వచ్చినప్పుడు ఆ చాట్‌ను విడుదల చేస్తానని పేర్కొన్నాడు. అయితే.. కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ పార్టీలపై ఆరోపణలతో ఉన్న లేఖను తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా సుఖేష్ బయట పెట్టాడు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకే తాను హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఆఫీసులు ఐదు సార్లు.. 15 కోట్ల రూపాయల చొప్పున రూ.75 కోట్లు ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు సుఖేష్. అయితే.. హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీసు ప్రాంగణంలోనే రేంజ్ రోవర్‌లో ఉన్న ఏపీ అనే వ్యక్తికి 75 కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నాడు. ఆ ఏపీ అనే వ్యక్తి కూర్చున్న రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని కూడా లేఖలో పేర్కొన్నాడు.
సుఖేష్ విడుదల చేసిన లేఖ.. సంచలనంగా మారగా.. అతడు చెప్పిన ఏపీ అంటే ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిళ్లైయా.. లేక మరో వ్యక్తా అంటూ చర్చించుకుంటున్నారు. గతంలో సుఖేష్.. త్వరలోనే కేజ్రీవాల్‌ను తీహర్ క్లబ్‌కు ఆహ్వానిస్తానని ఆ మధ్య కోర్టులో కామెంట్ చేయగా.. తాజాగా ఢిల్లీ సీఎంపై ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరి సుఖేష్ వ్యాఖ్యలపై నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.