ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రధాన సమస్య గాలి కాలుష్యం. రాను రాను గాలిలో నాణ్యత అనేది తగ్గిపోతోంది. అత్యంత తక్కువ గాలి నాణ్యత కలిగిన నగాలు భారతదేశంలో 37 ఉన్నాయనే లెక్కలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు పలు విధానాలను కూడా వాడుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఎదరవుతున్న సవాళ్లలో గాలి కాలుష్యం ఒకటి. మన దేశంలో కూడా గాలి నాణ్యత రాను రాను క్షీణిస్తున్న విషయం తెలిసిందే. దేశ రాజధానిలో అయితే ఎయిర్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కొన్ని ప్రాంతాల్లో సిగిరెట్ తాగిన దాని కంటే గాలి పీల్చడమే మహా ప్రమాదంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. దీనిని ఇలాగే వదిలేస్తే.. గాలి పీల్చి బతకాల్సిన మనుషులు ఆ గాలి పీల్చుతూనే చనిపోయే పరిస్థితి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత తక్కువ గాలి నాణ్యత కలిగిన 37 నగరాలు భారతదేశంలోనే ఉండటం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.
సాధారణంగా గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలు పీల్చుకునే గాలిని బట్టి కూడా అతని ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పైగా గాలి నాణ్యతను బట్టి మనుషులు నివసించేందుకు ఆ ప్రాంతం ఎంత అనువైనదో చెబుతారు. అంతేకాకుండా గాలి నాణ్యతను పర్టిక్యులేట్ మ్యాటర్ అని అంటారు. లేదంటే pm 2.5 అని పిలుస్తారు. అంటే మనిషి జుట్టు వ్యాసార్థం కంటే సన్నగా 2.5 మైక్రాన్స్ కంటే తక్కువగా ఉండేవి. వీటిని కేవలం మైక్రోస్కోప్ మాత్రమే చూడగలరు. ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ గాలిలో ఎక్కువగా ఉంటే మనిషి ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. వాటి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా నగరాల్లో ఈ గాలి నాణ్యత నానాటికి క్షీణిస్తోంది. అందుకు మారుతున్న జీవన విధానం, మొక్కల తగ్గి నివాసాలు పెరిగి పోవడం, పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పడం ప్రదాన కారణాలుగా చెప్పవచ్చు. మీరు పల్లెటూరులో అయితే ఇంటి ప్రాంగణం, ఇంటి ముందు, పెరట్లో అయినా చెట్లను పెంచుకుంటూ కాస్త కాకపోతే కాస్త అయినా స్వచ్ఛమైన గాలిని పొందవచ్చు. కానీ, అపార్టుమెంట్ జీవితంలో అది సాధ్యం కాదు. అంతేకాకుండా ఫ్రిడ్జులు, ఏసీలు వాడటం వల్ల కూడా గాలి కాలుష్యం పెరగడం, నాణ్యత క్షీణించడం జరుగుతోంది. తక్కువ నాణ్యత ఉన్న గాలిని పీల్చడం వల్ల ఆస్తమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో సిటీల్లో ఉండే వారు ఎయిర్ ప్యూరిఫయర్లను విరివిగా వాడుతున్నారు.
వాటి వల్ల ఇంట్లో కాస్త క్వాలిటీ ఉన్న గాలి లభిస్తోందంటూ చెబుతున్నారు. ఇప్పటికైనా మనిషి తన జీవన విధానాన్ని మార్చుకోకపోతే పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం ఉంటుందని నిపుణులు, డబ్యూహెచ్ వో సైతం హెచ్చరిస్తోంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తక్కువ దూరాలకు నడక, సైకిల్ ని వాడటం చేయాలి. వీలైతే మొక్కలు నాటాలి. ఏసీలు, ఫ్రిడ్జుల వాడకం కాస్త తగ్గిస్తే మంచిది. ప్లాస్టిక్, బొగ్గు వంటివి కాల్చకుండా ఉండాలి. ఎండాకాలంలో గాలిలో కాలుష్య కారణాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కూడా జాగ్రత్తలు వహించడం మంచిది. ఎవరికి వారు బాధ్యత తీసుకుంటేనే గాలి కాలుష్యాన్ని తగ్గించి, గాలి నాణ్యతను పెంచగలుగుతాం.