నిత్యం రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటూ.. బీజేపీపై విమర్శలు కురిపిస్తూ ఉండే రాహుల్ గాంధీ.. తాజాగా ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి. శీతలగాలులు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో చలి పెరిగి, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలోకి పడిపోయాయి. ఈ కారణంగా చాలా మంది ఇప్పటికే మరణించారు. అదీకాక పొగమంచు కారణంగా ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. వీటితో పాటుగా కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులు డిజిల్, పెట్రోల్ వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ.. ఉత్తర్వులు […]
కరెన్సీ నోట్ల మీద ఆర్బీఐ గాంధీజీ బొమ్మను ముద్రిస్తుంది. అయితే అప్పుడప్పుడు గాంధీజీ బదులు అంబేడ్కర్ బొమ్మను ముద్రించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీ సీఎం ఏకంగా కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బొమ్మ పక్కనే.. వినాయకుడు, లక్ష్మీ దేవిల బొమ్మలను ముద్రించాలని సూచించాడు. ఆఖరికి ఇండోనేషియా వంటి పరాయి దేశాల్లో కూడా కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ […]
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ‘నాడు-నేడు’ పథకం ద్వారా ఈ అసాధ్యం సుసాధ్యం అయ్యింది. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పాఠశాలల రూపు రేఖల్నే మార్చివేసింది. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆకర్షితులయ్యేలా ఈ ‘నాడు-నేడు’ పథకం […]
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక ఢిల్లీ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించే మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు కూడా జరిపింది. ఈ క్రమంలో ఢిల్లీలో వెలుగు చేసిన లిక్కర్ స్కామ్ తాజాగా తెలుగు రాష్ట్రాలను భయపెడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లిక్కర్ […]
Arvind Kejriwal : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా పలు వివాదాలకు దారి తీస్తోంది. తాజాగా, ఈ సినిమాపై కామెంట్లు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసంపై పలువురు బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ఇంటి ముందు ఉన్న బ్యారికేడ్లను పాడు చేయటంతో పాటు ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బుధవారం ‘ది కశ్మీర్ పైల్స్’పై కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ బీజేపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ప్లకార్డులు, జెండాలతో […]
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఇప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబర్ 26 న ప్రారంభించారు. పార్టీ స్థాపించి పట్టుమని పది సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే ఆప్ దేశరాజకీయాల్లో పలు సంచలనాలు సృష్టిస్తోంది. ఆప్ తొలిసారి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఆప్ పూర్తి మెజార్టీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. తాజాగా పంజాబ్‌లో జరిగిన […]
మన దేశంలో రాజకీయాల్లో, సినిమాల్లో రాణించాలంటే.. బలమైన బ్యాగ్రౌండ్ ఉండాలనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. అంతేకాక రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారితో పోలిస్తే సామాన్యులు రాజకీయాల్లో రాణించడం అంత సులభం ఏం కాదు. ఇది అందరికి తెలిసిన సంగతే. మహా అయితే ఎమ్మెల్యేగానే, ఎంపీగానో గెలవవచ్చు. కానీ ఏకంగా ఓ పార్టీ స్థాపించి.. దాన్ని అధికారంలోకి తీసుకువచ్చి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం అంటే పగటికలగానే భావిస్తారు. అయితే ఈ ఆలోచనా ధోరణిని బద్దలు కొట్టారు అరవింద్ కేజ్రీవాల్. […]
కొన్నేళ్ల క్రితం దేశ రాజధాని నడి బొడ్డులో.. మానవ రూపంలో ఉన్న మృగాళ్లు.. నడి రోడ్డు మీద.. ఓ అమాయకురాలిపై అత్యంత హేయమైన రీతిలో అత్యాచారం చేశారు. రోజుల తరబడి.. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఇక తన వల్ల కాదంటూ.. ఈ రాక్షస లోకంలో బతకలేనంటూ వెళ్లిపోయింది. ఆ ఘటన దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించింది. పార్లమెంటు అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా నిర్భయ చట్టం తీసుకువచ్చింది. కానీ ఏ చట్టం కూడా మృగాళ్లను భయపెట్టడం లేదు. […]
ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెలవులను ప్రకటించింది. ఢిల్లీలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ జనవరి 1 నుంచి 15 వరకు విద్యార్ధులకు శీతాకాలపు సెలవులను ప్రకటించింది. అయితే ఈ సెలవులు ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్కూళ్లకు మాత్రమే వర్తిస్తాయని విద్యా శాఖ అధికారులు తెలిపారు. దీంతో జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీలోని పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయి. కాగా రాష్ట్రంలో […]