ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవాగ్జిన్. రెండోది కోవీషీల్డ్. ఈ రెండూ రెండేసి డోసులు తీసుకోవాల్సిందే. కానీ ఒకవేళ మొదటి డోసు ఒక వ్యాక్సిన్ తీసుకుని ఆ తర్వాత రెండవ డోసు మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైతుంది. వేరువేరు వ్యాక్సిన్లను ‘మిక్సింగ్’ చేస్తే!!. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అధ్యయనం చేపట్టబోతోంది. డోసులను మిక్స్ లేదా కలపడం చేయాల్సిన అవసరం లేదని పూనావాలా పేర్కొన్నారు. తమిళనాడులోని వెల్లూర్ కాలేజీలో వ్యాక్సిన్ మిక్సింగ్పై అధ్యయనం చేపట్టనున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు.
అయితే దీనిపై కోవీషీల్డ్-కోవాగ్జిన్ మిక్సింగ్ ను సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మస్ సైరస్ పూనావాలా వ్యతిరేకించారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ బ్యాడ్ ఐడియా అని తేల్చేశారు. పూణేలోని తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సైరస్ పూనావాలా వ్యాక్సిన్ల మిక్సింగ్ గురించి మాట్లాడుతూ ఒకవేళా ఏదైనా తప్పు జరిగితే ఈ రెండు వ్యాక్సిన్ తయారీదారుల మధ్య తుగువులాట వచ్చే అవకాశముందన్నారు. కాబట్టి వ్యాక్సిన్ లను మిక్స్ చేయడం చాలా తప్పు అని నేను అనుకుంటున్నా అని సైరస్ పూనావాలా అన్నారు.
ఫీల్డ్ ట్రయిల్స్ లో వ్యాక్సిన్ మిక్సింగ్ రుజువు అవ్వలేదని తెలిపారు.కాగా ఇప్పటికే యూపీలో వ్యాక్సిన్ మిక్సింగ్పై స్టడీ చేశారు. అక్కడ తొలి డోసు రూపంలో కోవీషీల్డ్ మరో ఆరు వారాల వ్యవధిలో రెండవ డోసుగా కోవాగ్జిన్ ఇచ్చారు. 18 మంది వాలంటీర్లకు మిశ్రమ వ్యాక్సిన్లు ఇచ్చారు.
మిక్సింగ్ సురక్షితమే కాదు ఉత్తమ రోగ నిరోధక శక్తి వచ్చినట్లు ఐసీఎంఆర్ తన తొలి స్టడీలో తేల్చింది. మిశ్రమ టీకాలపై లోతుగా అధ్యయనం చేయాలని నిపుణుల కమిటీ భావిస్తున్న నేపథ్యంలో వెల్లూర్ మెడికల్ కాలేజీలో మరోసారి ట్రయల్స్ నిర్వహించనున్నారు.