మనకు తెలిసినంత వరకు దానం చేసే వారిలో గొప్ప వ్యక్తి ఎవరంటే ఈజీగా గుర్తుకు వచ్చే పేరు కర్ణుడు. ఎందుకంటే ఆయన ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేస్తాడని చెప్తారు. కానీ కర్ణుడి లాంటి వ్యక్తి ఉన్నాడని చెప్పడం అతిశయోక్తి కాదు.
మనకు తెలిసినంత వరకు దానం చేసే వారిలో గొప్ప వ్యక్తి ఎవరంటే ఈజీగా గుర్తుకు వచ్చే పేరు కర్ణుడు. ఎందుకంటే ఆయన ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేస్తాడని చెప్తారు. కానీ కర్ణుడి లాంటి వ్యక్తి ఉన్నాడని చెప్పడం అతిశయోక్తి కాదు. సాధారణంగా తన వద్ద ఉద్యోగం చేసే వ్యక్తులకు జీతాలు చెల్లిస్తారు. కాకపోతే వారి అవసరాలను గుర్తించి ఎక్కువ మొత్తంలో సాయం అందిస్తారు. లేదంటే ఆర్థికంగా చాలా సాయం చేస్తారు. కానీ మొత్తం రాబడిలోనే తను తక్కువ మొత్తం తీసుకుని తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులకు పంచే బాస్ ని చూశారా.. అలాంటి వ్యక్తి ఉన్నాడా అనిపిస్తుంది కదా! కానీ ఉన్నారండీ.. అతను శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్.
ఈయన పేరుకు తగ్గట్టుగానే త్యాగరాజే. తనకు సంబంధించినంత వరకు ఒక చిన్న ఇల్లు, కారు తప్ప మిగతా ఆస్తులన్నింటినీ తన ఉద్యోగ బృందానికి విరాళంగా ఇచ్చారు. మరి ఆ త్యాగమూర్తి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. త్యాగరాజన్ తమిళనాడులో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. మాథామాటిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందాడు. 1961లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో చేరారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఫైనాన్స్ కంపెనీలలో జాబ్ చేశారు. త్యాగరాజన్ తన 37వ యేట వ్యాపారం మొదలుపెట్టాడు. ప్రస్తుతం 30 కంపెనీలు ఉన్నాయి.
ఇంకో గమనించదగ్గ విషయం ఏమంటే.. ఇప్పటివరకు త్యాగరాజన్ వద్ద మొబైల్ లేదు. సెల్ ఫోన్ తన వద్ద ఉంటే దృష్టి మరల్చుతుందని అతని నమ్మకం. ఓ చిన్న ఇంట్లో నివసిస్తూ చాలా సింపుల్‌గా ఉంటారు. ఇక తన వ్యాపారానికి వస్తే శ్రీరామ్ గ్రూప్‌ను 1974 ఏప్రిల్ 5న చెన్నైలో ఆర్ త్యాగరాజన్, ఏవీఎస్ రాజా, టీ. జయరామన్ కలిసి స్థాపించారు. చిట్‌ఫండ్ వ్యాపారం తర్వాతనే రుణం, బీమా సౌకర్యాలను బిజినెస్‌లోకి ప్రవేశించాయి. తక్కువ ఆదాయ ప్రజలకు లోన్స్ ఇప్పించి త్యాగరాజన్ తన వ్యాపారాన్ని విస్తృతపరిచారు. త్యాగరాజన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను 750 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 6210 కోట్లు విరాళంగా ఇచ్చానని తెలిపారు.
శ్రీరామ్ గ్రూప్‌లో మొత్తం 1,08,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం తన వద్ద పని చేస్తున్న ఉద్యోగులకు విరాళంగా ఇచ్చానని వెల్లడించారు. సమాజంలో పేద ప్రజలకు ట్రక్కులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కోసం ఈ సంస్థ రుణాలు అందిస్తుందని, క్రెడిట్ హిస్టరీ లేని వ్యక్తులకు కూడా రుణాలు ఇవ్వడం ప్రమాదకరం కాదని నిరూపించానని తెలపారు త్యాగరాజన్. తాను కొంచెం వామపక్షవాదినని, సమస్యలతో చిక్కుకున్న వారి జీవితాల నుండి చెడును తొలగించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.