సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆరు పదులు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జైలర్ చిత్రంలో నటిస్తున్నారు.
సంక్రాంతి సెలవులు చూసుంటారు, దసరా సెలవులు చూసుంటారు. కానీ.. ఒక సినిమా రిలీజ్ అయితే సెలవులు ఇస్తారని మీకు తెలుసా? ఇది నమ్మడానికి కాస్త టైమ్ పట్టొచ్చు. కానీ.. నిజమే. తమిళ సూపర్ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్క్రీన్ మీద కనిపిస్తే చాలు వసూళ్ల వర్షం కురుస్తుంది. టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్స్ హౌజ్‌ఫుల్ అవుతుంటాయి. కోలీవుడ్‌లో రజినీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోకి లేదంటే.. తన క్రేజ్ ఏ రేంజ్లో ఉందో మీరే ఊహించుకోండి. అయితే.. తాజాగా రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఈ నెల 10న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఆ రోజున సౌత్ లోని కొన్ని ఏరియాల్లో ప్రదేశాల్లో సెలవులు ప్రకటించారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్, తమన్నా జోడిగా.. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా’ జైలర్’. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా.. చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో కొన్ని ఆఫీసులకి సెలవులు ప్రకటించారని తెలుస్తొంది. కొన్ని కంపెనీలు సెలవు ఇవ్వడమే కాకుండా.. ఫ్రీగా టికెట్స్ కూడా ఇచ్చాయట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. పండగలకు సెలవులు ఇవ్వడం చూశాం కానీ.. సినిమా రిలీజ్ అయితే కూడా సెలవులు ఇస్తారా! అని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు . రజనీకాంత్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే ఇందులోని పాటలు ఇప్పటికే జనాలను ఆకట్టుకున్నాయి.
‘నువ్వు కావాలయ్యా’ అనే పాటైతే జనాలకు విపరీతంగా నచ్చేసింది. రీల్స్ రూపంలో అందరినీ కట్టిపడేస్తొంది. చిన్నా,పెద్ద తేడా లేకుండా.. నువ్వు కావాలయ్యా.. అంటూ.. రీల్స్‌లో సందిడి చేస్తున్నారు. అయితే.., గతంలో రజనీకాంత్ నటించిన “కబాలి” మూవీకి కూడా ఇలానే కొన్ని ఏరియాల్లో సెలవలు ఇచ్చి నానా హంగామా చేశారు. తీరా ఆ మూవీ ఫలితం చూసి అభిమానులు నీరు కారిపోయారు. ఇక జైలర్ విషయంలో అయినా.. ఆ అంచనాలు నిజం అవుతాయేమో చూడాలి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం రజనీ మూవీ కంటెంట్ సరిగ్గా ఉండి హిట్ కొడితే 400 కోట్లు కొల్లగొట్టడం గ్యారంటీ. ఒకవేళ ఇదే జరిగితే గనుక.. సూపర్ స్టార్ కు తిరుగు ఉండదు. మరి.. మూవీ రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డ్‌లు బద్దలు కొడుతుందో చుడాలి.