ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!
ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? 72 ఏళ్ల వయసులనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. స్టైల్ కి పెట్టింది పేరు.. డైలాగ్ డెలివరీకి పెట్టింది పేరు ఆయన. ఆయన మ్యానరిజం, యాటిట్యూడ్ వేరే లెవల్ ఉంటుంది. దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా ఈ హీరోకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన క్రేజ్ అలాంటిదిలాంటిది కాదు. సినిమా ఇండస్ట్రీలో రారాజు.. కోట్లలో రెమ్యునరేషన్.. అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు. గర్వం అనే పదానికి తన డిక్షనరీలో చోటు లేనటువంటి వ్యక్తి. నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ఆయన హీరోనే. ఎవరికైనా ఆపదొస్తే వెంటనే సహాయం చేస్తారు. ఎవరో గుర్తుపట్టారా? రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నారు.
వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న హీరోకి ఈ సినిమా రూపంలో సాలిడ్ హిట్ వచ్చి పడింది. అర్థమైందా రాజా ఆయన ఎవరో? అవును వన్ అండ్ ఓన్లీ రజినీకాంత్. ఆయన చిన్నప్పటి ఫోటోనే ఇది. బస్ కండక్టర్ గా మొదలైన ప్రయాణం.. ఇండియాలోనే క్రేజీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన నిరాడంబరత్వానికి నిదర్శనం. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేసిన రజినీకాంత్.. ఇటీవల కాలంలో వరుసగా ప్లాప్స్ అందుకున్నారు. దీంతో రజినీకాంత్ పని అయిపోయిందనుకున్నారు. రాజకీయంగా కూడా ఆయన మీద విమర్శలు చేశారు. ఆ మధ్య హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజినీకాంత్ మాట్లాడిన మాటలకు కొంతమంది నేతలు విమర్శించారు.
దానికి కౌంటర్ గా రజినీకాంత్ జైలర్ రిలీజ్ ముందు చెన్నైలో ఇచ్చిన స్పీచ్ లో విమర్శనాస్త్రాలు సంధించారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా అంటూ సెటైర్ వేశారు. ఇది రజినీకాంత్ ని విమర్శించిన వారికే అంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే రజినీకాంత్ నటించిన జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రజినీకాంత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో దునియా మొత్తం రజినీకాంత్ మ్యానియా కనబడుతోంది.