తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ.. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ.. పల్లే పట్నం ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య భూమిక పోషించారు కేసీఆర్.
తెలంగాణ కోసం ఎంతోమంది తమ ప్రాణాలు త్యాగం చేశారు. 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని (టీఆర్ఎస్) ఏర్పాటు చేశారు కేసీఆర్. ఆనాటి నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూ.. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ.. పల్లే పట్నం ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య భూమిక పోషించారు కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 2 జూన్ 2014 న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. ప్రస్తుతం ఆయన దేశరాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ని.. భారత రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్) గా మార్చిన సంగతి తెలిసిందే. త్వరలో దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇటీవల బహిరంగ ప్రకటనలో తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతికి బీఆర్ఎస్ అహర్శిశలూ కష్టపడుతుందని కేసీఆర్ ఇటీవల బహిరంగ సభలో ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎక్కడో మారుమూల ఉన్న ఓ జంట ఒంటిపై సంకెళ్లతో ‘కేసీఆర్ రావాలి.. సంకెళ్లు తెంచాలి’ అంటూ బ్యానర్ చేతపట్టి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు పాదయాత్రగా సాగుతున్నారు.
మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాకు చెందిన బాబురావు, శోభ మస్కీ దంపతులు కేసీఆర్ రావాలి.. మా కష్టాలు తీర్చాలి అంటూ ఓ బ్యానర్ పట్టుకొని వినూత్నంగా పాదయాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని.. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. అవన్నీ దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే బీఆర్ఎస్ రావాలని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజురా నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆదివారం చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో బాబురావు, శోభ మీడియాతో మాట్లాడుతూ.. తాము ముందు నుంచి సీఎం కేసీఆర్ కి ఎంతో అభిమానులమని.. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో విదర్భ నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ మద్దతుగా పాదయాత్ర చేశామని అన్నారు. ఆ సందర్భంగా కేసీఆర్ ని కలిసినట్లు బాబురావు గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ని కలిసి భవిష్యత్ లో మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు.