ఈ మద్య చిన్న సినిమాలు పెద్ద హిట్ అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా ‘బలగం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వేణు. కమెడియన్ గా తన సత్తా చాటిన వేణు డైరెక్టర్ గా రూపొందించిన చిత్రం ‘బలం’. ఈ చిత్రాన్ని చూసి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫిదా అయ్యారు.
ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. సామాన్య మహిళలకే కాదు ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా వచ్చిపడుతున్నాయి. అసభ్యకరమైన వీడియోలు, ఫోటో మార్ఫింగ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఆమె పుట్టిన రోజు వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి.. పుట్టిన రోజును జరుపుకున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటంతో ఆమెకు నోటీసులు పంపించింది ఈడీ. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ రానున్నారు.
బీఆర్ఎస్ విసృతస్థాయి సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి ప్రజల సమస్యలను తీర్చాల్సిన ఎమ్మెల్యే.. మహిళా సర్పంచ్ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలిచారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్య శాఖ మంత్రి తాడి కొండ రాజయ్య.. తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళా సర్పంచ్ ఆవేదన చెందుతున్నారు.
దేశ రాజకీయాల్లో మార్పు తేవడానికి 'బీఆర్ఎస్' అగ్రనేతలు అడుగులు వేస్తుంటే, కొంత మంది నేతలు మాత్రం లైంగిక పర్వాలకు తెరలేపారు. అధికార పార్టీకి చెందిన ఓ దళిత మహిళా సర్పంచ్ స్థానిక నేతలు తనను లైంగికంగా వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ.. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ.. పల్లే పట్నం ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య భూమిక పోషించారు కేసీఆర్.