తెలుగు దేశం యువ నేత నారా లోకేష్ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ప్రజా సమస్యలపై గళమెత్తి.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. ఇక వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం కోసం.. కింద స్థాయి నుంచి పార్టీని పునరుద్ధరించడం కోసం.. త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నాడు. యువగళం పేరటి.. 400 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో.. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలోమీటర్లు తిరగనున్నాడు. తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభం అయ్యే పాదయాత్ర.. […]
నారా లోకేష్.. టీడీపీ జాతీయాధ్యక్షుడు చద్రబాబు నాయుడి కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు. ఇక త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు లోకేష్. 400 రోజుల పాటు.. 4000 కిలోమీటర్ల మేర.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నాడు లోకేష్. ఈ నెల 23న లోకేష్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఓ యువరైతు.. టీడీపీ యువనేతకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. ప్రసుత్తం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫోటో […]
పాదయాత్ర.. రాజకీయాల్లో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జనంతో మమేకమవుతూ.. వారి కష్టాలు తెలుసుకుంటూ.. సమస్యలు వింటూ.. పరిష్కారాల గురించి హమీ ఇస్తూ.. ముందుకు సాగుతారు నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా సుదీర్ఘ పాదయాత్రలు చేపట్టి.. అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాద యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడు […]
పాదయాత్ర.. రాజకీయాల్లో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఓ వ్యక్తి నాయకుడు కావాలంటే.. ప్రజల్లో తిరుగుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. నేనున్నాను అని భరోసా ఇవ్వాలి. అందుకు సరైన ఎంపిక పాదయాత్ర. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్లాట్‌పామ్ వంటివి ఎన్ని వచ్చినా సరే.. పాదయాత్రకున్న క్రేజే వేరు. తెలుగు రాజకీయాల్లో పాదయాత్ర పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వరుస ఓటములతో కుదేలవుతున్న […]
రాజకీయాలు అంటే ఏసీ రూమ్ లో ఉంటూ మాట్లాడటం కాదు.. ప్రత్యక్షంగా జనంలోకి వెళ్లి వారి కష్టసుఖాల గురించి తెలుసుకొని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసేవాడు నిజమైన రాజకీయ నాయకుడు అంటారు. ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి రాజకీయవేత్తలు పాదయాత్ర చేపడుతుంటారు. పాదయాత్రలు చేసి ఎంతో మంది రాజకీయ నేతలు ప్రజల్లో తమ ఇమేజ్ పెంచుకున్నారు. పాదయాత్ర పునాధిగా ప్రభుత్వాలు సైతం ఏర్పడ్డాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అవబోతున్నారు టీడీపీ జాతీయ […]
మన దేశంలో సినిమా హీరలకు, క్రీడాకారులకు ధీటుగా రాజకీయ నాయకులకు కూడా ఓ రేంజ్‌లో అభిమానులుంటారు. ఇక తమ ప్రియతమ నేతపై తమకు ఎంత అభిమానం ఉందో చాటుకోవడానికి విభిన్న ప్రయత్నాలు చేస్తారు. కొందరు పూజలు నిర్వహిస్తే.. మరి కొందరు పాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపడతారు. ఇప్పుడ మీరు చదవబోయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. ఇక్కడ ఓ యువకుడు కేటీఆర్ సీఎం కావాలని పాద యాత్ర చేస్తున్నాడు. దీనిలో విడ్డూరం ఏం ఉంది అంటే […]
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఇప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబర్ 26 న ప్రారంభించారు. పార్టీ స్థాపించి పట్టుమని పది సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే ఆప్ దేశరాజకీయాల్లో పలు సంచలనాలు సృష్టిస్తోంది. ఆప్ తొలిసారి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఆప్ పూర్తి మెజార్టీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. తాజాగా పంజాబ్‌లో జరిగిన […]
రాజకీయ నాయకులు, సినిమా వాళ్లకు బలం ప్రజలే. జనాల్లో వారి పట్ల ఉండే క్రేజే వారికి బలం, బలగం. ఒక్కసారి జనాలకు దూరం అయితే.. మునపటి క్రేజ్ రావడం చాలా కష్టం. ఇక రాజకీయ నాయకులను ప్రజలకు మరింత చేరువ చేసే వాటిల్లో ముఖ్యమైంది పాదయాత్ర. ప్రజల్లో మమేకం అయ్యేందుకు.. వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు.. ప్రజలకు నాయకుల పట్ల నమ్మకం కలిగించే ఏకైక అస్త్రం పాదయాత్ర. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ […]
తెలంగాణలో రాజకీయాల్లో వచ్చే నెల నుంచి పాదయాత్రలు మొదలుకానున్నాయి. దాదాపుగా అన్ని పార్టీల నేతలు రాబోయే రోజుల్లో పాదయాత్రలు చేయబోతున్నామని ప్రకటించారు. రాజకీయంగా ఉనికిని కాపాడుకునేందుకు పార్టీలన్నీ ఇదొక వ్యూహంగా భావిస్తున్నాయి. గతంలో ఎంతోమంది నేతలు పాదయాత్రలతో సక్సెస్ అయ్యి సీఎం పీఠంపై కూర్చుకున్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించాడు. పల్లె పల్లె తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసి చాలా వరకు విజయం […]
తెలంగాణలో ఇప్పుడు పాదయాత్ర రాజకీయాలు జోరందుకోబోతున్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నేటి తరం రాజకీయ నాయకులు పాదయాత్ర మంత్రాన్ని వాడుకోబోతున్నారు. గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొంత భాగంలో పర్యటించారు. అప్పట్లో ఈ పాదయాత్ర రాజకీయంగా సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నరాజశేఖర్ రెడ్డి అప్పటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. దీంతో పలు మార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా […]