ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ట్రైన్ యాక్సిడెంట్లో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రమాదానికి గురైన రైళ్లలో తెలుగు ప్రయాణికులు కూడా ఉన్నారని తెలుస్తోంది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మాటలకు అందని ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందారు. బాలేశ్వర్‌కు దగ్గర్లోని బహనగా దగ్గర శుక్రవారం రాత్రి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఒక గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. యాక్సిడెంట్ రాత్రి వేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇండియన్ రైల్వేస్ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా దీన్ని అధికారులు చెబుతున్నారు. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ యాక్సిడెంట్ చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు.
ఇక, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు 70 మంది వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా హౌరా, బాలేశ్వర్ లాంటి స్టేషన్లలో రైలు ఎక్కారని సమాచారం. ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి స్టేషన్లలో ఈ ప్యాసింజర్లు దిగాల్సి ఉంది. ట్రైన్ యాక్సిడెంట్‌కు సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాలు, రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. ఈ ట్రైన్స్‌లో తెలుగువాళ్లు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం వైజాగ్, విజయనగరం స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు. విశాఖపట్నం స్టేషన్‌కు 0891-2746330, 0891-2744619 నంబర్లకు కాల్ చేయొచ్చు. శ్రీకాకుళం స్టేషన్‌కు 0894-2286213, 0894-2286245 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.
Coromandel Express Incident
Biggest Train Accident after 2004..#CoromandelExpressAccident #CoromandalExpress pic.twitter.com/UYFwqy92Jv— Fukkard (@Fukkard) June 3, 2023