గత కొంత కాలంగా దేశంలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం కర్ణాటకలో పర్యటించారు. గత కొంత కాలంగా తనను తాను కశ్మీరీ పండిట్ అనీ, శివుడి భక్తుడినంటూ చెప్పుకునే రాహుల్ గాంధీకి ఈ మధ్య దైవ భక్తి ఎక్కువయిపోయినట్టుంది. ఆయన ఈ మధ్య క్రమం తప్పకుండా దేవాలయాలను సందర్శిస్తున్నారు.
కర్నాటకలోని చిత్రదుర్గ్‌లోని శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందర్శించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య 75వ జన్మదిన వేడుకలకు కోసం వచ్చిన రాహూల్ గాంధీ మార్గ మద్యలో స్వామి వారి మఠానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. అంతేకాదు మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణారు చేతుల మీదుగా ‘ఇష్టలింగ దీక్ష’ను స్వీకరించారు. స్వామి గురు బసవన్న బోధనలు ఎప్పటికీ నిలిచిపోతాయనీ, వాటి గురించి తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని రాహుల్ గాంధే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మఠంలో రాహుల్ గాంధీ స్వామీజీలను కలిసే సమయంలో అక్కడే ఉన్న హవేరి హోసముత్ స్వామి ‘రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు’ అని చెప్పినట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న మురుఘా మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుఘా శరణరు జోక్యం చేసుకుంటూ.. ఇక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్నారు. ఇది రాజకీయ వేదిక కాదని.. ఆ విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారట.
రాహూల్ గాంధీ వెంటన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. రాహుల్ దీక్ష ఓ అపురూప ఘట్టమని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.2023 ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం స్వామీజీలతో రాహుల్ గాంధీ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Karnataka: Congress leader Rahul Gandhi visits Sri Murugha Math in Chitradurga along with party leaders DK Shivakumar & KC Venugopal pic.twitter.com/nxmwiHeRfI
— ANI (@ANI) August 3, 2022
It is an absolute honour to visit Sri Jagadguru Murugharajendra Vidyapeetha and receive the ‘Ishtalinga Deekshe’ from Dr. Sri Shivamurthy Murugha Sharanaru.
The teachings of Guru Basavanna are eternal and I am humbled to learn more about it from the Sharanaru of the Math. pic.twitter.com/5Dgj53roSp
— Rahul Gandhi (@RahulGandhi) August 3, 2022