తల్లి ప్రేమ ఎంత గొప్పది అనే ఈ విషయాన్ని వర్ణించాలనుకుంటే ఎంత గొప్ప పదాలను ఉపయోగించినా.. తల్లి ప్రేమ ముందు తక్కువ అంటారు.. ఎందుకంటే ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేనంతగా గొప్పగా తల్లి తన పిల్లలను ప్రేమిస్తూ ఉంటుంది. దేవుడుకు తనకు బదులుగా అమ్మను సృష్టించారని అంటారు. నవ మాసాలు మోసి కనిపెంచిన అమ్మంటే ఆ యువకుడికి అంతులేని ప్రేమ. అలాంటి అమ్మ దూరమై ఉండలేకపోయాడు ఆ యువకుడు. అమ్మలేని ఈ లోకంలో నాకు ఇంకెవరూ లేరని భావించాడు. అనారోగ్యంతో కన్నుమూసిన అమ్మను మర్చిపోయి ఉండలేక పోయాడు. తల్లి లేని జీవితం వ్యర్థం అనుకున్నాడు.. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్.. అంబర్ పేట డీడీ కాలనీకి చెందిన తేజ (25) అనే యువకుడికి తల్లి అంటే ఎంతో ప్రేమ. ఇటీవల తేజ తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమెను తల్చుకొని కుమిలిపోయాడు. తల్లిని ఇక చూడలేను.. తల్లి లేని జీవితం వ్యర్థం అనుకొని తేజ శామీర్ పేట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. తల్లీకొడుకులు చనిపోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లి అంటే కొడుకు కి ఎంత ప్రేమ.. అంటూ స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది చదవండి: నాకు ఇష్టం లేకున్నా అమ్మానాన్న ఆ పని చేయమన్నారు! ఇది చదవండి: ట్రయాంగిల్ లవ్.. లా కాలేజ్లో ఘోరం.. క్లాస్లో అందరూ చూస్తుండగా..