పంజాబ్, అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్ క్యాంప్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భాసా గ్రామంలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శిబిరంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో పదిమంది జవాన్లకు గాయాలయ్యాయి. వారందరికీ స్థానిక గురునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అమృత్‌సర్‌లోని ఖాసా గ్రామం వద్ద ఉన్న 144వ బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ క్యాంపులో ఆదివారం(మార్చి 5) కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ సత్తెప్ప.. క్యాంపులోని సహచర జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతిచెందినట్టు బీఎస్‌ఎఫ్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. వారిపై కాల్పులు జరిపిన అనంతరం సత్తెప్ప తనను తాను గన్‌తో కాల్చుకున్నాడని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గాయపడిన మరో 10 మంది జవాన్లను గురునానక్ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.