వర్షాలు, వరదలు కారణంగా నష్టపోవడమే కానీ లాభ పడిన సందర్భాలుంటాయా.. అంటే చాలా అరుదు అనే చెప్పాలి. ఇటీవల కుండపోతగా కురుస్తున్న వర్షాలతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తర, దక్షిణ భారత దేశంలో కుండపోతగా కురిసిన వర్షాలకు జన జీవనం అస్థవ్యస్థమైంది.
వర్షాలు, వరదలు కారణంగా నష్టపోవడమే కానీ లాభ పడిన సందర్భాలుంటాయా.. అంటే చాలా అరుదు అనే చెప్పాలి. ఇటీవల కుండపోతగా కురుస్తున్న వర్షాలతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తర, దక్షిణ భారత దేశంలో కురిసిన భారీ వర్షాలకు జన జీవనం అస్థవ్యస్థమైంది. ఉత్తర భారతంలో కురిసిన వానలకు అనేక నదులు పొంగి పొర్లి గ్రామాలు జలమయమయ్యాయి. ఇప్పుడిప్పుడే అక్కడ వర్షాభావం తగ్గుముఖం పట్టింది. అయితే వరద నీరు నిలిచి పోయి ఉంది. వరద బాధిత ప్రాంతాల్లో కొంత మంది రెస్య్కూ వాలంటీర్లు సహాయక చర్యలు చేపడుతున్నారు. అలా ఫ్లడ్ రెస్య్కూ వాలంటీర్‌గా వెళ్లాడు జగ్జీత్ సింగ్. ఆ సేవకు భగవంతుడు కరణించాడేమో.. అతడికి 35 క్రితం దూరమైన ప్రేమ మళ్లీ తిరిగొచ్చింది.
ఇటీవల పంజాబ్‌లో కురిసిన వర్షాలకు పాటియాలా ప్రాంతం నీట మునిగింది. వేలాది ఇళ్లు నాశనమయ్యాయి. వాలంటీర్‌గా అక్కడకు వెళ్లాడు జగ్జీత్ సింగ్. ఆ సమయంలో అతడి అత్త ఫోన్ చేసి.. మీ అమ్మమ్మ వాళ్లది ఆ ప్రాంతమే. బహుశా బోహార్ పూర్ ప్రాంతం అనుకుంటా అని చెప్పింది. అక్కడకు వెళ్లాక అసలు నిజం తెలిసి విస్తుపోవడంతో పాటు ఆనంద డోలికల్లో మునిగితేలిపోయాడు. భావోద్వేగానికి గురి చేస్తున్న ఈ ఘటన తాలుకా కథనం ఇది. జగ్జీత్ సింగ్ ఆరు నెలల వయస్సు ఉన్నప్పుడు తండ్రి మరణించారు. తల్లి హర్జీత్ కౌర్ రెండో వివాహం చేసుకుంది. అయితే జగ్జీత్ సింగ్‌కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు నానమ్మ, తాతయ్యలు అతడిని అమ్మ నుండి దూరం చేసి.. తమ వద్దకు తెచ్చుకుని పెంచుకోసాగారు. పెద్దయ్యాక తన తల్లిదండ్రులు ఏరని అడిగితే యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పుకుంటూ వచ్చారు. పెరిగి పెద్దవాడైన జగ్జీత్ సింగ్ గురుద్వారాలో గాయకుడిగా మారాడు.
అంతేకాకుండా భాయ్ ఘనయ్యా జీ పేరుతో ఎన్జీవో నడుపుతున్నాడు. ఆ ఎన్జీవో తరుఫున ఇటీవల వరదలతో ప్రభావితమైన పాటియాలాలో సహాయక చర్యలు చేపట్టేందుకు వాలంటీర్‌గా వెళ్లినప్పుడు.. అత్త ఇచ్చిన సమాచారంతో అమ్మమ్మ ఇల్లు కనుక్కొని వారి ఇంటికి వెళ్లాడు. అయితే ఆమె తన అమ్మమ్మ ప్రీతమ్ కౌర్ అవునా, కాదా అని నిర్ధారించుకునేందుకు సవాలక్ష ప్రశ్నలు వేశాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. కానీ తాను హర్జీత్ మొదటి కుమారుడ్ని అనే సరికి మొదట నమ్మలేదు. ఆ తర్వాత ఆ తల్లికి దూరమైన దురదృష్టవంతున్ని నేనే అనేసరికి కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత తల్లి హర్జీత్‌ను కలిశారు. ఆమె కాలికి గాయం కారణంగా సరిగ్గా నడవలేకపోయింది. చివరకు కుమారుడు ఆమె వద్దకు వెళ్లాడు.
కొడుకును చూసిన ఆనందంలో భావోద్వేగాన్ని ఆపులేక కన్నీరు కార్చింది. కుమారుడ్ని గుండెలకు హత్తుకుని ఏడ్చింది. 35 ఏళ్ల తర్వాత తన కొడుకుని చూసి బిగ్గరగా రోదించింది. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి ఆయన ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. అతడు చెబుతున్న దాని ప్రకారం.. తన తల్లి బతికే ఉందని ఐదేళ్ల క్రితం తెలిసిందని, అయితే ఆమె గురించి తెలిసిన వారంతా చనిపోవడంతో ఏం చేయాలో తోచలేదని, తన తల్లి గురించి నాన్నమ్మ, తాతయ్యలు ఏమీ చెప్పలేదని భావోద్వేగానికి గురయ్యాడు. ఎట్టకేలకు 35 ఏళ్ల తర్వాత తల్లి, ఆమె కుటుంబ సభ్యులను చూసిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.