కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేయాలనుకుంటున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. మునుపటి నోటిఫికేషన్ కు సవరణలు చేస్తూ ఖాళీల భర్తీని భారీగా పెంచింది. ఇది నిరుద్యోగులకు సువర్ణావకాశమనే చెప్పాలి.
భారత సైన్యంలో కొన్ని ప్రత్యేకమైన శునకాలు సైతం దేశరక్షణలో నిమగ్నమైన ఉంటాయనే విషయం తెలిసిందే. అలా బార్డర్‌లో రక్షణగా ఉన్న ఒక స్నిఫర్ డాగ్ ఇటివల గర్భం దాల్చి.. మూడు పిల్లలకు సైతం జన్మనిచ్చింది. అయితే.. ఆ డాగ్ గర్భం దాల్చి, పిల్లల్ని కనడంపై ఆర్మీ అధికారులు విచారణకు ఆదేశించారు. విరాల్లోకి వెళితే.. మేఘాలయాలోని బంగ్లాదేశ్ సరిహద్దులో విధుల్లో ఉన్న శునకం లాల్సీ గర్భం దాల్చడంపై విచారణకు ఆదేశించారు అధికారులు. 43వ బెటాలియన్‌కు చెందిన ఈ స్నిఫర్ […]
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం ‘బీఎస్ఎఫ్’ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్, రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీలు: 1635 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్)- 11 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్)- 312 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్)- 982 హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్)- […]
భారత సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులు ఎంతో కఠినంగా ఉంటారు. కొన్నిసార్లు పొరబాటున సరిహద్దు ధాటి భారత్ లోకి ప్రవేశిస్తుంటారు పాకిస్థాన్ దేశస్తులు. వారి వివరాలు పూర్తిగా తెలుసుకొని అనుమానించదగ్గ వ్యక్తులు కాదని నిర్ధారించుకున్న తర్వాత పాకిస్థాన్ కి అప్పగిస్తుంటారు భారత సైనికులు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. సరిహద్దుల గురించి తెలియన పాక్ కి చెందిన ఓ బాలుడు భారత భూభాగంలోకి అడుగు పెట్టాడు. దీంతో ఆ బాలుడి వివరాలు తెలుసుకొని తండ్రిని పిలిపించి […]
పంజాబ్, అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్ క్యాంప్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భాసా గ్రామంలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శిబిరంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో పదిమంది జవాన్లకు గాయాలయ్యాయి. వారందరికీ స్థానిక గురునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అమృత్‌సర్‌లోని ఖాసా గ్రామం వద్ద ఉన్న 144వ బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ క్యాంపులో ఆదివారం(మార్చి 5) కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ సత్తెప్ప.. క్యాంపులోని […]
దేశ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన అధికారి, అదే ప్రజలను మోసం చేశాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) ఉన్నతాధికారిగా పనిచేసిన ఓ వ్యక్తి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరికి అతని కారణంగా మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మీ, పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన గుర్గావ్ లో చోటుచేసుకుంది. ప్రజలను మోసం చేసిన నిందితుడు ప్రవీణ్ యాదవ్ 2012లో బీఎస్ఎఫ్ లో చేరాడు. […]