పంజాబ్‌లో దారుణం నెలకొంది. తన ఇరవై ఏళ్ల కూతురిని ఓ తండ్రి హత్య చేశాడు. దీంతో ఆగకుండా ఆమె మృతదేహాన్ని టూవీలర్‌కి కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఆ డెడ్‌బాడీని రైల్వే ట్రాక్ మీద పడేశాడు. ఈ ఘటన అమృత్‌సర్ జిల్లాలో గురువారం జరిగింది.
ఈ మద్య మానవ సంబంధాలు పూర్తిగా నశించి పోతున్నాయని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు..మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు, అని కవి అందెశ్రీ అన్నట్లు.. కొంతమంది మనుషులు చేస్తున్న దారుణాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటున్నాయి. కనీ, పెంచిన పిల్లలను అత్యంత దారుణంగా చంపుతున్నారు.. ప్రేమకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను చంపుతున్న పిల్లలు ఉన్నారు. ఓ తండ్రి కూతురు చేసిన చిన్న పొరపాటుకు హత్య చేయడమే కాదు.. తన బైక్ కి కట్టి ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పంజాబ్‌లో దారుణం నెలకొంది. తన ఇరవై ఏళ్ల కూతురిని ఓ తండ్రి హత్య చేశాడు. దీంతో ఆగకుండా ఆమె మృతదేహాన్ని టూవీలర్‌కి కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఆ డెడ్‌బాడీని రైల్వే ట్రాక్ మీద పడేశాడు. ఈ ఘటన అమృత్‌సర్ జిల్లాలో గురువారం జరిగింది. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన చిత్రాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తండ్రి నిహాంగ్ సిక్కుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
జండియాలా పట్టణం పరిధిలో ముచ్చల్ గ్రామంలో బావు అనే కూలీ ఉన్నాడు. అతనికి ఇరవై ఏళ్ల కూతురు ఉంది. ఆమె బుధవారం ఇంట్లో ఎవరికి తెలియకుండా బయటకి పోయి తిరిగి మరునాడు గురువారం ఇంటికి వచ్చింది. దీంతో తండ్రికి కోపం వచ్చి కూతురిపై విరుచుకుపడ్డాడు. ఓ ఆయుధంతో కొట్టి చంపాడు. అనంతరం కూతురి మృతదేహాన్ని బైక్‌కు కట్టి రోడ్డుపై ఈడ్చెకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశంలో రైల్వే ట్రాక్ సమీపంలో పడేశాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై మర్డర్ కేసు నమోదు చేశారు. కూతురిపై అనుమానంతో ఆమెను చంపాడని ప్రాథమిక విచారణలో తేలింది.