పరిచయం అవసరం లేని పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తథైవచ’ అనే శ్లోకంలోని మొదటి మాటని గాంధీ ఆచరిస్తే, రెండవ మాటని నేతాజీ ఆచరించారు. అహింసతో స్వాతంత్ర్యాన్ని సాధించాలనే నినాదం గాంధీదైతే.. హింసకు హింసే మార్గం, ఆ హింసతోనే స్వాతంత్ర్యం సాధ్యం అని నమ్మిన నాయకుడు సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ సామ్రాజ్యం భయంతో దేశం వదిలిపెట్టి పోవడానికి నేతాజీ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సాయుధ శక్తి కీలకపాత్ర పోషించిదన్నది నిజం. అలాంటి నేతాజీ ఇంకా జపాన్‌లోనే ఉండిపోయారు. ఆయన పుట్టింది ఇక్కడ, ఆయన ఉండాల్సింది ఇక్కడ, ఆయన అస్థికలు భారత్‌కు తెప్పించండని ఆయన కూతురు అనితా బోస్ ఫాఫ్(79) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఆగస్ట్ 15న ఒక ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు.
భారత్ విదేశీ బానిస సంకెళ్ళను తెంచి 75 ఏళ్ళు అవుతుంది. స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ హీరో సుభాష్ చంద్రబోస్ ఇంకా తన మాతృభూమికి రాలేదు. ఆయన జీవితం మొత్తం స్వతంత్ర పోరాటానికే అంకితమిచ్చారు. స్వాతంత్ర్యం కోసం తన కుటుంబాన్ని, తన కెరీర్‌ని, తన జీవితాన్ని కూడా త్యాగం చేశారు. నేతాజీ మరణం ఒక మిస్టరీ. ఆయన విమాన ప్రమాదంలో మరణించారని పలువురు పేర్కొన్నారు. నేతాజీ అవశేషాలను డీఎన్‌ఏ పరీక్ష చేయడానికి జపాన్ ప్రభుత్వం అంగీకరించింది. డీఎన్‌ఏ పరీక్షకు నేను కూడా సిద్ధమే. 1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదంలో మరణించలేదని భారత జాతి మొత్తం నమ్ముతున్నాము. 1945-1946 మధ్య ఆయన విదేశంలో మరణించారని ఆధారాలు ఉన్నాయి. నేతాజీ అవశేషాలను జపాన్ అధికారి ఒకరు సేకరించి.. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారు. అప్పటి నుంచి మూడు తరాల పూజారులు ఆయన అవశేషాలను సంరక్షిస్తూ వస్తున్నారు.
నేతాజీ అస్థికలను భారత్‌కు తెచ్చేందుకు భారత ప్రభుత్వం కృషి చేయాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతురు అనితా బోస్ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకప్పుడు అఖండ భారతంలో కలిసి ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలు కూడా తనకు మద్ధతు ఇవ్వాలని కోరారు. “మనమంతా నేతాజీ కుటుంబం, మనమంతా ప్రస్తుతం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. భారతీయ, బంగ్లాదేశీ, పాకిస్థానీ సోదరి, సోదరీమణులారా మీ అందరినీ ఆహ్వానిస్తున్నా.. నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకొచ్చేందుకు నాకు సహకరించండి” అని ఆమె కోరారు. మరి నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురమ్మని కోరిన అనితా బోస్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే నేతాజీ అస్థికలను భారత్‌కి తెచ్చేందుకు మీ గొంతు వినిపించండి. ‘Bring Netaji Home’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేయండి.
Anita Bose Pfaff, daughter of Netaji Subhas Chandra Bose urges Indian govt to bring his remains back to the country from Japan. Statement: pic.twitter.com/hzChrH9ttG
— Sidhant Sibal (@sidhant) August 15, 2022